సిపిఐ పార్టీ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి భాసినేని ప్రభాకర్
విశాలాంధ్ర ముదిగుబ్బ/ధర్మవరం : ఎన్డీఏ ప్రభుత్వం రైతుల సౌకర్యార్థం ఇప్పటికే ప్రకటించిన అన్నదాత సుఖీభవ పథకాన్ని తక్షణమే అమలు చేయాలని సిపిఐ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి భాసినేని ప్రభాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ ప్రారంభమై సుమారు రెండు నెలల కావస్తున్న నేటికీ ఎన్డీఏ ప్రభుత్వం తాను హామీ ఇచ్చిన అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయకపోవడంతో విఫలం చెందారని మండిపడ్డారు. రైతులు తమ పంటల పెట్టుబడి సాగులో భాగంగా ఆర్థికంగా తీవ్ర ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత రెండు మూడు నెలల నుంచి ఈ పథకానికి సంబంధించిన పరిహారాన్ని ఇదిగో ఇస్తాం.. అదిగో ఇస్తామని కాలయాపన చేస్తూ ప్రభుత్వం రైతులతో దోబూజలాడుతోంది అని కానీ నేటికీ ఆ పథకాన్ని అమలు చేయలేదని, తద్వారా దానికి సంబంధించిన నగదును రైతుల ఖాతాలో జమ చెయ్యకపోవడం దారుణం అన్నారు.కాగా ఈ పథకానికి సంబంధించి రైతుల జాబితాలో చాలామంది పేర్లు లేవని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అధికారులు తక్షణమే మండలంలోని
అన్ని సచివాలయాల వద్ద రైతులకు సంబంధించిన అర్హుల జాబితాను ఏర్పాటు చేసి
ఆ జాబితాలో పేర్లు లేని రైతులు రెండవసారి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. కనుక ప్రభుత్వం ఈ అన్నదాత సుఖీభవ పథకాన్ని తక్షణమే అమలు చేయడమే గాక అర్హులైన ప్రతి రైతుకు ఈ పథకం వర్తించేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. లేని పక్షంలో త్వరలోనే మండల రైతులతో కలిసి సిపిఐ , కాంగ్రెస్ పార్టీల ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
అన్నదాత సుఖీభవ పథకాన్ని తక్షణమే అమలు చేయాలి
- Advertisement -
RELATED ARTICLES


