చైర్మన్ అంబటి అరుణశ్రీ, వైస్ చైర్మన్ ఎం. అయ్యప్ప
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని బత్తలపల్లి రోడ్డు వద్దగల వ్యవసాయ మార్కెట్ను అన్ని విధాలుగా అభివృద్ధి దిశలో నడుపుతామని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ అంబటి అరుణశ్రీ, వైస్ చైర్మన్ ఎం.అయ్యప్ప తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ఆర్డిఓ కార్యాలయంలో గల ఆర్డీవో మహేష్ కు మార్కెట్ యార్డ్ యొక్క స్థితిగతులను తెలియజేశారు. తదుపరి గత ప్రభుత్వ హయాంలో గత ఐదు సంవత్సరాలుగా దాదాపు 56 లక్షలు మార్కెట్ యార్డుకు ఆదాయాన్ని కోల్పోవడం జరిగిందని, ఆ ఆదాయమును రాబట్టుకునే విధంగా చట్టపరంగా అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంతేకాకుండా మార్కెట్ యార్డులో ఆదాయాన్ని పెంచుకోవడానికి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణము చేపట్టదలిచామని తెలిపారు. గత ఐదు సంవత్సరాలలో ధర్మవరం మార్కెట్ యార్డ్ అభివృద్ధికి నోచుకోలేకపోవడం బాధాకరమని తెలిపారు. ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో మార్కెట్ యార్డును అన్ని రకాలుగా ఆదాయాలను సమకూర్చుకుంటూ, అభివృద్ధి బాటలో నడుపుతామని తెలిపారు. అభివృద్ధి బాటకు కావలసిన సలహాలు సూచనలు ఆర్డిఓ వద్ద స్వీకరించడం జరిగిందని తెలిపారు. ఇందుకు చట్టబద్ధంగా ప్రభుత్వం ద్వారా తీసుకోవలసిన చర్యలను కూడా మాకు ఆర్డిఓ వివరించడం జరిగిందని తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు, ఆరోగ్య శాఖామంత్రి, ధర్మవరం ఎమ్మెల్యే సత్య కుమార్ యాదవ్కు, పరిటాల శ్రీరామ్కు మమ్ములను కమిటీలో పదవి ఇచ్చినందుకు మరోసారి వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్రప్రదేశ్ కు సాధించేందుకు ఎంతో కృషి చేస్తున్నారని, ఇందుకు మా వంతుగా మా ప్రయత్నాలను నిరంతరం కొనసాగిస్తామని వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జాతీయ బిజెపి నాయకులు అంబటి సతీష్, మార్కెట్ యార్డ్ కార్యదర్శి నాగేంద్ర కుమార్ పాల్గొన్నారు.
వ్యవసాయ మార్కెట్ యార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాము
- Advertisement -
RELATED ARTICLES


