క్రికెట్ కోచ్ రాజశేఖర్
విశాలాంధ్ర ధర్మవరం; మాజీ క్రికెటర్ శ్రీనివాసులు జ్ఞాపకార్థం ధర్మవరంలో ఆర్ డి టి – ఏ డి సి ఏ-అండర్-12 బాలుర కోసం మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నట్లు కోచ్ రాజశేఖర్, క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు బాలాజీ, ఆర్ డి టి ఏరియా ప్రోగ్రాం కోఆర్డినేటర్ శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధర్మవరం మండలంలోని ఏ జట్టు అయినా పాల్గొనడానికి అర్హులు అన్నారు. పాఠశాల జట్లు కూడా పాల్గొనడానికి అర్హులు అన్నారు. అనంతపురం జిల్లా క్రికెట్ అసోసియేషన్ మండల స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ఈ టోర్నమెంట్లను నిర్వహిస్తోంది అని తెలిపారు. మండల స్థాయి టోర్నమెంట్ విజేతలు అనంతపురంలో జరిగే జిల్లా స్థాయి టోర్నమెంట్‌లో పాల్గొంటారు అని తెలిపారు. జిల్లాలోని ప్రతి ఒక్కరికీ న్యాయమైన అవకాశాలు కల్పించడానికి అనంతపురం జిల్లా క్రికెట్ అసోసియేషన్ మండల స్థాయి నుండి ఈ టోర్నమెంట్లను నిర్వహిస్తోంది అని తెలిపారు.టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు ధర్మవరం మండలానికి చెందిన ఆసక్తిగల జట్లు ఆర్డీటీ క్రికెట్ కోచ్ రాజశేఖర్ – 9985929285ను సంప్రదించవచ్చని తెలిపారు. కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ కు దరఖాస్తు చేసుకోండి..
- Advertisement -
RELATED ARTICLES


