Homeజిల్లాలుశ్రీ సత్యసాయిప్రభుత్వ ఆసుపత్రిలో ఈ నెల 12న రక్తదాన శిబిరం

ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ నెల 12న రక్తదాన శిబిరం

- Advertisement -

ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ తిపేంద్ర నాయక్
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ నెల 12న రక్తదాన శిబిరమును నిర్వహిస్తున్నట్లు ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ తిపేంద్ర నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ యువజన దినోత్సవం, అదేవిధంగా స్వామి వివేకానంద 164 వ జయంతి సందర్భంగా ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రక్తదానం ఇరువురికి ప్రాణదానమవుతుందని తెలిపారు. సాటి మనిషి హృదయంలో సంతోషాన్ని ఆనందాన్ని నింపగలిగిన మానవుని జన్మ ధన్యమవుతుందని తెలిపారు. ధర్మవరం ఎమ్మెల్యే, ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ సహకారంతో ఏర్పాటు చేస్తున్నట్లు వారు తెలిపారు. కావున పట్టణంలోని వివిధ ప్రభుత్వ సంస్థలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, రాజకీయ నాయకులు, యువతి, యువకులు మీడియా ప్రతినిధులు పాల్గొని తమవంతుగా రక్తదానాన్ని ఇచ్చి విజయవంతం చేయాలని వారు తెలిపారు. రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని వారు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు