Homeజాతీయంలోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది మృతి

లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది మృతి

- Advertisement -

జమ్మూకశ్మీర్‌లోని దోడా జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భద్రతా సిబ్బంది వెళ్తున్న ఓ వాహనం అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో 10 మంది ఆర్మీ సిబ్బంది ప్రాణాలు కోల్పోగా.. మరి కొందరు గాయపడ్డారు. భదేర్వాహ్‌-చంబా రోడ్డులోని ఖన్నీ పర్వత ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. లోయలో పడిపోయిన బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనంలో 17 మంది భద్రతా సిబ్బంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వెంటనే రంగంలోకి దిగిన ఆర్మీ, పోలీసులు సంయుక్తంగా రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టాయి. గాయపడిన వారిని ఉధంపుర్‌ మిలిటరీ ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు