Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఎం.ఐ. ఛాంప్స్ పోటీ పరీక్ష చరిత్రలో రికార్డు సృష్టించిన రిషి విద్యాలయ..

ఎం.ఐ. ఛాంప్స్ పోటీ పరీక్ష చరిత్రలో రికార్డు సృష్టించిన రిషి విద్యాలయ..

- Advertisement -

పాఠశాల డీన్ భాస్కర్ రెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం;; ఎం ఐ చామ్స్ పోటీ పరీక్ష చరిత్రలో ధర్మవరం రిషి విద్యాలయ పాఠశాల రికార్డు సృష్టించిందని డీన్ భాస్కర్ రెడ్డి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ రిషి విద్యాలయ
ఎం.ఐ. ఛాంప్స్ ఇండియా నిర్వహించిన ఇంగ్లీష్, గణితం, సైన్స్ పోటీ పరీక్షల్లో
రిషి విద్యాలయ విద్యార్థులు అసాధారణ ప్రతిభను ప్రదర్శించి ఘనవిజయం సాధించారు అని తెలిపారు.ఈ పరీక్షల్లో మా పాఠశాల నుంచి మొత్తం 224 మంది విద్యార్థులు పాల్గొనగా, పెద్ద సంఖ్యలో విద్యార్థులు లెవల్–2కు అర్హత సాధించడం గర్వకారణం అని తెలిపారు.
ఇంగ్లీష్ విభాగం లోఇంగ్లీష్ పరీక్షకు 71 మంది విద్యార్థులు హాజరుకాగా, 65 మంది విద్యార్థులు లెవల్–2కు ఎంపికయ్యారు అని అన్నారు.
వారిలో 12 మంది విద్యార్థులు టాప్ 10 ర్యాంకులు సాధించడం జరిగిందన్నారు.
గణితం విభాగంలో గణిత పరీక్షకు 93 మంది విద్యార్థులు పాల్గొనగా, 72 మంది విద్యార్థులు లెవల్–2కు అర్హత సాధించారు అని తెలిపారు.అందులో 30 మంది విద్యార్థులు టాప్ 10 ర్యాంకులు సాధించడం విశేషం అని తెలిపారు.సైన్స్ విభాగంలో సైన్స్ పరీక్షకు 93 మంది విద్యార్థులు హాజరుకాగా, 87 మంది విద్యార్థులు లెవల్–2కు ఎంపికయ్యారు అని తెలిపారు.వారిలో 65 మంది విద్యార్థులు టాప్ 10 ర్యాంకులు సాధించి రికార్డు సృష్టించడం జరిగిందన్నారు.ఎం.ఐ. ఛాంప్స్ఇండియా చరిత్రలో,రెండు రాష్ట్రాల్లో ఒకే ఒక్క పాఠశాలగా ఈ స్థాయిలో అత్యధిక అర్హతలు మరియు టాప్ ర్యాంకులు సాధించిన ఘనత రిషి విద్యాలయానికి దక్కింది అని తెలిపారు.ఈ సందర్భంగా డీన్ భాస్కర్ రెడ్డి, సీఏఓ రవీంద్ర, ప్రిన్సిపల్ కరణ్ స్వరూప సింగ్, వైస్ ప్రిన్సిపల్ కల్యాణి, ఏఓ రంగారెడ్డి విద్యార్థులప్రతిభనుహృదయపూర్వకంగా అభినందించారు. విద్యార్థుల కష్టపడి చేసిన సాధన, ఉపాధ్యాయుల అంకితభావం మరియు తల్లిదండ్రుల సహకారమే ఈ విజయానికి ప్రధాన కారణమని వారు తెలిపారు.
పాఠశాల యాజమాన్యం భవిష్యత్తులో కూడా ఇలాంటి గొప్ప విజయాలు సాధించాలని ఆకాంక్షించింది అని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు