ప్రిన్సిపాల్ సురేష్ బాబు
విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని గుట్ట కింద పల్లి లో గల పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాలకు (అడ్మిషన్లు) ఆగస్టు 5వ తేదీ తుది గడువు అని ప్రిన్సిపాల్ సురేష్ బాబు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆసక్తి గల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అంతేకాకుండా అడ్మిషన్లకు వచ్చే విద్యార్థులు ఇదివరకు ఏ పాలిటెక్నిక్ నందు అడ్మిషన్ అయి ఉండకూడదు అని వారు స్పష్టం చేశారు. ఒరిజినల్ సర్టిఫికెట్లు, రెండు సెట్ల జిరాక్స్ కాపీలు, మూడు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, అలాగే ఫీజు కట్టడానికి 6000 వెంట తీసుకొని రావాలని వారు తెలిపారు. స్పాట్ అడ్మిషన్లు ద్వారా చీటి పొందే విద్యార్థులకు ఫీజు రీయంబర్స్మెంట్ సౌకర్యము వర్తించదు అని వారు తెలిపారు.
పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాలకు ఆగస్టు 5వ తేదీ తుది గడువు
- Advertisement -
RELATED ARTICLES


