ఆగస్ట్ 17న యూనియన్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిద్దాం
జిల్లా అధ్యక్షులు పయ్యావుల ప్రవీణ్ పిలుపు
విశాలాంధ్ర అనంతపురం టౌన్ : జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం యూనియన్ డెబ్బై ఏళ్లుగా పోరాడుతూ వచ్చిందని ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు పయ్యావుల ప్రవీణ్ వివరించారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఎ.పి.యు. డబ్ల్యూ.జే.) అనంతపురం జిల్లా కార్యవర్గ సమావేశం మంగళవారం ప్రెస్ క్లబ్ లో జరిగింది. సమావేశానికి జిల్లా అధ్యక్షుడు పయ్యావుల ప్రవీణ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్ట్ 17న యూనియన్ 70 వ ఆవిర్భావ దినోత్సవం జిల్లాలో అన్ని నియోజకవర్గ, మండల కేంద్రాల్లో వివిధ రూపాల్లో ఘనంగా నిర్వహించాలని కోరారు. ఆగస్ట్ 30 వ తేదీ లోపు జిల్లా యూనియన్ సభ్యత్వ నమోదు పూర్తి చేయాలని, ఆ తర్వాత జిల్లా మహాసభ నిర్వహిస్తామని తెలిపారు. త్వరలో అనంతపురం ప్రెస్ క్లబ్ ఎన్నికలు నిర్వహిస్తామని వెల్లడించారు. ప్రధాన కార్యదర్శి షేక్ మహమ్మద్ ఆయూఫ్ మాట్లాడుతూ యూనియన్ సంస్థగతంగా బలోపేతం కావడానికి ప్రతి సభ్యుడు కృషి చేయాలని పిలుపునిచ్చారు. జర్నలిస్టు సంక్షేమం హక్కుల సాధన కోసం ఏపీయూడబ్ల్యుజే 70 ఏళ్లుగా పోరాటం చేస్తూనే ఉందన్నారు. ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు యూనియన్ సభ్యులందరూ భాగస్వాములు కావాలన్నారు. సమావేశంలో ఐజేయూ సభ్యులు సనప రామకృష్ణ, ఐజేయు మాజీ సభ్యులు ప్రభాకర్ నాయుడు, మార్కండేయులు, జిల్లా ఉపాధ్యక్షులు లింగప్రసాద్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పూలశెట్టి చలపతి, జిల్లా ట్రెజరర్ చౌడప్ప, ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాగేంద్రనాథ్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు భూమి రెడ్డి, బాల రంగారెడ్డి, జిల్లా సంయుక్త కార్యదర్శి ప్రదీప్ రెడ్డి, డేవిడ్ తదితరులు పాల్గొన్నారు.
జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, సంక్షేమమే ఏపీయూడబ్ల్యూజే లక్ష్యం
- Advertisement -


