- Advertisement -
ధర్మవరం ఎమ్మార్వో సురేష్ బాబు
విశాలాంధ్ర ధర్మవరం;; ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువులో పర్యటనలో భాగంగా వచ్చినప్పుడు నలుగురు విద్యార్థులు తమకు సైకిళ్ళు కావాలన్న అభ్యర్థన మేరకు ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ధర్మవరం ఎమ్మార్వో సురేష్ బాబు కొత్తచెరువు వెళ్లి, ఆ విద్యార్థుల యొక్క కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన మేరకు తమకు నాలుగు సైకిళ్ళను (విలువ రూ. 30,000)ఇవ్వడం జరిగిందని వారు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, కలెక్టర్కు కృతజ్ఞతలను తెలియజేశారు.


