Sunday, February 8, 2026
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిమీ విజయమే - తల్లిదండ్రులు, ఉపాధ్యాయల విజయం

మీ విజయమే – తల్లిదండ్రులు, ఉపాధ్యాయల విజయం

- Advertisement -

చదువుతో పాటు క్రమశిక్షణ చాలా ముఖ్యమన్న పరిటాల శ్రీరామ్


విశాలాంధ్ర ధర్మవరం; మాతృదేవోభవా, పితృదేవోభవా, ఆచార్యదేవోభవా అని పలికే ముగ్గురు దేవుళ్లను ఒక్క చోట చేర్చాలా మెగా పీటీఎం కార్యక్రమాన్ని నిర్వహించే ఆలోచన చేసిన మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా ధన్యవాదాలు అంటూ.. ధర్మవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ అన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని గుట్టకిందపల్లిలో ఉన్న మోడల్ స్కూల్లో జరిగిన మెగా పీటీఎం 2.0 కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా విద్యార్థులు వారి తల్లిదండ్రులను ఆప్యాయంగా పలకరించారు. స్వయంగా తల్లిదండ్రులకు పాదపూజ చేసే కార్యక్రమాన్ని ఆయన వీక్షించారు. అలాగే పాఠశాలలో తరగతి గదులన్నీ పరిశీలించారు. ఉపాధ్యాయులతో మాట్లాడి అక్కడ సౌకర్యాల గురించి కూడా తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఒకటో పట్టణ సిఐ నాగేంద్రప్రసాద్, ఎంఈఓ ఇతర టిడిపి నాయకులు స్థానిక పెద్దలు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులకు మొక్కలు పంపిణీ చేసి వారికి గ్రీన్ పాస్ పోర్టులు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీరామ్ మాట్లాడుతూ ఎలాంటి స్వార్థం లేకుండా మన భవిష్యత్తు గురించి ఆలోచించేది, మనం బాగుండాలని కోరుకునేది, తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు మాత్రమేనన్నారు. ఒకప్పుడు పాఠశాలకు వెళ్లాలంటే నాలుగైదు కిలోమీటర్లు నడిచి వెళ్లే వారని.. కానీ ఇప్పుడు మన వద్దకే పాఠశాలలు వచ్చాయన్నారు. ఈ జనరేషన్ లో పుట్టడం ఒక అదృష్టంగా భావించాలన్నారు. ఉపాధ్యాయులు పిల్లల్ని ఉన్నత శిఖరాలు చేర్చేందుకు చాలా కష్టపడుతుంటారని… అయితే వారు ఐఏఎస్ లు, ఐపీఎస్ లు ఇతర ఉన్నతరంగాల్లో ఉండటం కంటే.. మంచి విలువలతో కూడిన మానవత్వం కలిగిన మనుషులుగా సమాజంలో ఉండాలన్నదే లక్ష్యంగా పెట్టుకోవాలని ఆయన సూచించారు. విలువలు లేని విద్య సమాజానికి మంచిది కాదన్నారు. గతంలో సెల్ ఫోన్లు లేని కాలంలో కూడా తాము చదువుకున్నామని.. ఇప్పుడు ప్రతి విద్యార్థికి కంప్యూటర్ పరిజ్ఞానం ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులోకి తెచ్చారన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణ పేరుతో విద్యా కానుక కిట్లు అందజేశారని.. అలాంటి మహనీయుల గురించి తెలుసుకునే అవకాశం ఈ విధంగా కల్పించారన్నారు. పిల్లలు ఎదిగే క్రమంలో చాలా ఇబ్బందులు పడుతుంటారని… వాటిని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనించాలన్నారు. పిల్లలకు కూడా గుడ్ టచ్.. బ్యాడ్ టచ్ గురించి ఖచ్చితంగా తెలియజేయాలని సూచించారు. తల్లిదండ్రులు పిల్లలతో సన్నిహితంగా లేకపోతే వారి మనసులో ఏముంది వారి ప్రవర్తన ఎలా ఉందన్నది తెలుసుకోలేరన్పిల్లల మానసిక పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు వారితో మాట్లాడుతూ తెలుసుకోవాలన్నారు. పిల్లలు తల్లిదండ్రులను గౌరవించే సంస్కృతి చిన్నప్పటి నుంచే ఉండాలన్నారు. వారికి పాద నమస్కారం చేయడమన్నది చాలా ముఖ్యమని.. వారి ఆశీస్సులు ఉంటేనే మనం ఏదైనా సాధించగలమన్నారు. ప్రస్తుతం తల్లి పేరుతో ఇస్తున్న మొక్కను మన అమ్మలాగా చూసుకోవాలని శ్రీరామ్ సూచించారు ఇందుకు సంబంధించిన వివరాలన్నీ గ్రీన్ పాస్ పోర్ట్ బుక్ లో ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, కమిటీ వారు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు