- Advertisement -
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని రైల్వే స్టేషన్లో మధ్యన నుంచి 30 సంవత్సరాల వయసుగల ఒక వ్యక్తి రైలు కిందపడి మృతి చెందడం జరిగిందని ధర్మవరం జిఆర్పి పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మృతుడు లేత నీలం రంగు టీ షర్టు, నలుపు రంగు షార్ట్, అదేవిధంగా అతని ఎడమ చేతిపై నేహా అనే పచ్చబొట్టు కలదని తెలిపారు. కావున ఈ వ్యక్తిని గుర్తుపట్టిన వారు ధర్మవరం జిఆర్పి పోలీసులకు సమాచారం ఇవ్వాలని వారు తెలిపారు. మరిన్ని వివరాలకు సెల్ నెంబర్ 9440557054కు గాని 9951325345కు గాని సమాచారం అందించాలని తెలిపారు.


