డిఏఓ..ఖతీజన్ కుప్రా
విశాలాంధ్ర ధర్మవరం;; రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గములలో భారత ఎన్నికల సంఘం -ఇండియా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్మెంట్ ఆదేశాల మేరకు పట్టణంలోని ఆర్డిఓ సమావేశ మందిరంలో శ్రీ సత్య సాయి జిల్లాలోని 160 ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల జాబితా నిర్వహణపై శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని డిఏఓ కతిజున్ కుప్రా తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్డిఓ మహేష్ ఆదేశాను ప్రకారం ఈ శిక్షణ నిర్వహిస్తున్నట్లు వారి తెలిపారు. జూలై నెలలో 8వ, 9వ, 10వ, 11వ, 15వ,16 వ తేదీలలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వారి తెలిపారు. బ్యాచ్ కి 50 మంది చెప్పిన ఆరు బ్యాచుల ప్రకారం శిక్షణ ఇస్తున్నట్లు వారు తెలిపారు. బిఎల్ఓ లకు శిక్షణా తరగతులయందు ఆన్లైన్ ద్వారా నిర్వహించడం అయినదని తెలిపారు. బిఎల్వోలు ఓటర్ల నమోదు తొలగింపులు, సవరణ తదితర విషయములలో తీసుకోవలసిన జాగ్రత్తలను కూడా ఈ శిక్షణా తరగతుల్లో వివరించడం జరిగిందని తెలిపారు. తప్పులు లేని ఓటరు జాబితా తయారు చేయుటలో బిఎల్ఓ లు కీలకపాత్ర వహించాలని తెలిపారు. బి ఎల్ వోలు విధులు నిర్వహించుటలో ఎన్నో జాగ్రత్తలు కూడా తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని వారు తెలిపారు. అంతేకాకుండా ఎన్నికలకు సంబంధించిన ప్రాథమిక అంశాల పైన కూడా పూర్తి అవగాహన కల్పించడం జరుగుతోందని తెలిపారు. భారత రాజ్యాంగంలో గల అధికరణాలను గూర్చి ఎన్నికలకు సంబంధించిన ప్రజా ప్రాతినిధ్య చట్టం ఎన్నికల నమోదు చట్టం తదితర చట్టాలలోని ముఖ్యమైన సెక్షన్లు గూర్చి అవగాహన కల్పించడం జరిగిందన్నారు. బూత్ లెవెల్ అధికారుల విధులు ఎన్నికలకు సంబంధించిన వివిధ ఫారాలను భర్తీ చేసే విధానం ట్రైన్స్ విచారణ నిర్వహించే విధానం గూర్చి కూడా విసదీకరించడం జరిగిందని తెలిపారు. ఎన్నికలకు ముందు ఎన్నికల సమయంలో ఎన్నికల తదనంతరం బిఎల్వోలు ఏ విధమైన విధులు నిర్వహించాలో కూడా పూర్తిగా వివరించడం జరిగిందని తెలిపారు. ఎన్నికల కమిషన్ తెలిపిన ప్రతి సూచనలను తప్పక పాటించాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల ఉప తాసిల్దార్ ఈశ్వరయ్య, ఎన్నికల సీనియర్ అసిస్టెంట్ రాఘవరెడ్డి, ఎన్నికల కార్యాలయ ఆపరేటర్లు,50 మంది బిఎల్వోలు పాల్గొన్నారు.
ఎన్నికల జాబితా నిర్వహణపై బూత్ లెవెల్ అధికారులకు శిక్షణ కార్యక్రమం..
- Advertisement -
RELATED ARTICLES


