Sunday, January 18, 2026
Homeజిల్లాలుశ్రీ సత్యసాయికేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను రద్దు చేయాలి..

కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను రద్దు చేయాలి..

- Advertisement -

జింకా చలపతి, ముసుగు మధు. పూల శెట్టి రవికుమార్
విశాలాంధ్ర ధర్మవరం;; కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను వెంటనే రద్దు చేయాలని చేతి వృత్తిదారుల రాష్ట్ర అధ్యక్షుడు జింకా చలపతి, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు, సిపిఐ పట్టణ కార్యదర్శి పూలశెట్టి రవికుమార్, ఏఐటియుసి నాయకులు ఎర్రం శెట్టి రమణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా తెచ్చి కార్మికులకు పనిగంటలను పెంచుతున్నదని వెంటనే వీటిని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. కార్మికులకు కనీస వేతనం 26,000 అమలు చేయాలని, కేంద్ర కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు కలిసి సంయుక్తంగా దేశ వ్యాప్త సమ్మెకు పిలుపు ఇచ్చినట్లు తెలిపారు. అందులో భాగంగానే బుధవారం ధర్మవరం పట్టణంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సర్కిల్ నందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుడగ వెంకటనారాయణ, జిల్లా గౌరవ అధ్యక్షులు గుర్రం వెంకటస్వామి, చెన్నంపల్లి శ్రీనివాసులు, మీటర్ రీడర్స్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కిరణ్, నియోజకవర్గ కార్యదర్శి దస్తగిరి, ప్లంబర్స్ అండ్ ఎలక్ట్రిషన్ కార్మిక సంఘం అధ్యక్షులు, కార్యదర్శి, గోవిందరాజులు,లక్ష్మీనారాయణ, ఆర్గనైజింగ్ కార్యదర్శి ఆంజనేయులు, తాజుద్దీన్, కార్మికులు రామకృష్ణ,సుబ్బు, మసూద్, సురేంద్ర, ఓబులేసు, చిన్న, జనార్ధన్, మహిళా సమాఖ్య లీడర్స్ లలితమ్మ,లింగమ్మ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు