Homeజిల్లాలుఅనంతపురంపుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువ

పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువ

- Advertisement -

విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఉరవకొండ మండలం కౌకుంట్ల గ్రామానికి చెందిన ఎస్సీ,ఎస్టీ డివిజనల్ మానిటరింగ్ కమిటీ సభ్యులు అయిన చకారి రవి జన్మదిన వేడుకలను సోమవారం ఉరవకొండ పట్టణంలోని రోడ్లు భవనాల అత్యధిక గృహంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, అభిమానులు, మిత్రులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి ఘనంగా సన్మానించారు. సమాజానికి ఆయన అందించిన సేవలు ప్రశంసనీయం అని పేర్కొంటూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించగా, కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కౌకుంట్ల రవి మాట్లాడుతూ, తనపై చూపిన ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆశీస్సులతో మరింత బాధ్యతగా సేవలు అందిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ వార్డు సభ్యులు మీనుగ రామాంజనేయులు, రవి, మాజీ ఎంపీటీసీ సభ్యులు విజయకుమార్, మాజీ వార్డు సభ్యులు పెద్దన్న, దళిత సంఘం నాయకులు ఓబయ్య, అంజి తదితర మిత్రులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు