కడియంలో వైభవంగా గీతా జయంతి వేడుకలు.
విశాలాంధ్ర – కడియం : మానవాళికి జీవన విధానాన్ని ప్రబోధించే శ్రీమద్ భగవద్గీత జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని సోమవారం శ్రీ భ్రమరాంబిక సమేత మల్లేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో, గోశాల సంరక్షణ సమితి ఆధ్వర్యంలో శ్రీ కృష్ణ మందిరం నందు గీతా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో ఉదయం నుండి సాయంత్రం వరకు మహిళలు సామూహిక గీతా పారాయణం చేశారు. అనంతరం గోశాల సంరక్షణ సమితి అధ్యక్షులు గిరజాల వీర్రాజు (బాబు) రామకృష్ణ తులసీ దంపతులు శ్రీకృష్ణునికి శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు భగవద్గీత పుస్తకాలు, తీర్ధ ప్రసాదాలు అందజేశారు. ఈకార్యక్రమంలో కడియం గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.


