Homeమార్పు… మార్పు…మార్పు

మార్పు… మార్పు…మార్పు

- Advertisement -

రాష్ట్రవ్యాప్తంగా మార్మోగిన నినాదం
బీజేపీ ప్రజా వ్యతిరేక పాలనపై భగ్గుమన్న సీపీఐ శ్రేణులు

  • ఊరూరా సాగిన ప్రచార యాత్రలు
  • పార్టీలకతీతంగా పెద్దసంఖ్యలో పాల్గొన్న ప్రజలు
  • మోదీ నియంతృత్వ విధానాలు ఎండగట్టిన నేతలు

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: కేంద్రంలోని బీజేపీ ప్రజా వ్యతిరేక పాలనను నిరసిస్తూ సీపీఐ పాదయాత్రలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దేశ రాజకీయాల్లో మార్పు రావాలి… కావాలి నినాదాలు మిన్నంటాయి. రాజధాని నుంచి గ్రామశాఖ వరకు పాదయాత్రలు చేపట్టారు. పల్లె, పట్నం, ఊరూ, వాడా మార్పు రావాలి, మార్పు కావాలి నినాదాలు ప్రతిధ్వనించాయి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని, బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని, కార్మిక హక్కులు పరిరక్షించాలని, ధరల పెరుగుదలను అరికట్టాలని, మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీపీఐ శ్రేణులు ఎక్కడికకక్కడ పెద్దఎత్తున చేపట్టిన భారీ ప్రదర్శనల్లో సాధారణ ప్రజలు కూడా పార్టీలకతీతంగా పాల్గొని సంఘీభావం తెలిపారు.మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, నియంతృత్వ పోకడలు, రాజ్యాంగ, ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలను సీపీఐ నేతలు ఎండగట్టారు.
దేశ ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యల నుండి విముక్తి కలగాలన్నా, కార్పొరేట్ రంగాల కబంధహస్తాల నుండి దేశాన్ని కాపాడుకోవాలన్నా మార్పు అవసరమని సీపీఐ జాతీయ నాయకులు డాక్టర్ కె.నారాయణ స్పష్టం చేశారు. ఆయన అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లె ఎన్‌టీఆర్ సర్కిల్‌లో పాదయాత్ర ప్రారంభించారు. బెంగళూరు బస్టాండ్ మీదుగా చిత్తూరు బస్టాండ్ వరకు కొనసాగిన ఈ పాదయాత్రలో వివిధ వర్గాలకు చెందిన ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. నారాయణ మాట్లాడుతూ నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడి 12 సంవత్సరాలు అయినా ఏ ఒక్క సమస్య పరిష్కారానికి నోచుకోకపోగా, ఎన్నికల్లో చేసిన ఒక్క వాగ్దానాన్ని అమలు చేయలేదన్నారు. అధికారంలోకి రాకముందు నోటికొచ్చిన హామీలిచ్చి…గద్దె నెక్కిన తర్వాత ప్రజల నడ్డి విరుస్తున్నారని విమర్శించారు. గతంలో ఎన్నడూలేనంతగా రోజురోజుకూ నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకే దేశం – ఒకే ఓటు అన్నవారు రెండు, మూడు రకాల జీఎస్‌టీల బదులు ఒకే జీఎస్‌టీ ఎందుకు పెట్టడం లేదని, పెట్రోల్, డీజిల్, గ్యాస్‌ను జీఎస్‌టీలోకి ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు. మహిళలను అగ్రభాగాన నిలబెడతామని మాటలు చెపుతూ, చేతల్లో మాత్రం మహిళా బిల్లు అమలును కావాలనే తాత్సారం చేస్తున్నారని విమర్శించారు. పాలనలో అన్ని విధాలా ఘోర వైఫల్యం చెందిన మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించేవరకు పోరాటం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి పి.మహేష్, సహాయ కార్యదర్శి తోపు కృష్ణప్ప తదితరులు పాల్గొన్నారు.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని విద్యాధరపురం కుమ్మరిపాలెం సెంటర్‌లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య పాదయాత్ర ప్రారంభించారు. శేఖర్బాబు భవన్ నుంచి సితార సెంటర్ వరకు భారీ పాదయాత్ర నిర్వహించారు. పాదయాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమానికి తొలుత స్థానిక డివిజన్ కార్యదర్శి కంచర్ల నాగేశ్వరరావు స్వాగతోపన్యాసం ఇవ్వగా, జి.కోటేశ్వరరావు శేఖర్ బాబు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు దోనేపూడి శంకర్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఏఐవైఎఫ్ నగర కార్యదర్శి లంక గోవిందరాజులు యువజన సమాఖ్య జెండా ఎగురవేశారు. ఈశ్వరయ్య మాట్లాడుతూ దేశ రాజకీయాల్లో మార్పు రావాలి… ప్రజాస్వామిక విధానాలు అమలు చేయడంలో మార్పు రావాలన్నారు. నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం మార్పు రావాలి. మతోన్మాదాన్ని వ్యతిరేకించడంలో మార్పు రావాలి. రాజ్యాంగ హక్కులు పరిరక్షించడంలో మార్పు రావాలి. ఎన్నికల విధానంలో మార్పు రావాలి. ధరల పెరుగుదలను అరికట్టడంలో మార్పు రావాలి. ఆర్థిక విధానాల అమలులో మార్పు రావాలి. కష్టించి పని చేసే శ్రమ జీవుల జీవితాల్లో మార్పు రావాలి. ఇవన్నీ జరగాలంటే 12 ఏళ్లుగా దిల్లీ గద్దెపై కూర్చుని నియంతృత్వ విధానాలు అమలు చేస్తున్న బీజేపీని అధికారం నుంచి మార్చివేయాలని ఈశ్వరయ్య అన్నారు. ఇందుకోసమే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో భారీ ప్రచార పాదయాత్రలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ప్రజలు పెద్దఎత్తున పాల్గొని మోదీ ప్రభుత్వ నిరంకుశ, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసించాలని పిలుపునిచ్చారు. దేశంలో సమస్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయని, నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, బ్లాక్ మార్కెటింగ్ వ్యవస్థ విజృంభించి ప్రజలను దోచుకుంటోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజాస్వామ్య హక్కులు కాలరాస్తున్నారని, ప్రశ్నించే ప్రతి గొంతుకను జైళ్లలో నిర్బింధిస్తున్నారని మండిపడ్డారు. కులాలు, మతాలు, జాతుల మధ్య తగువులు పెట్టి దేశాన్ని భ్రష్టుపట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. విద్యా వ్యవస్థలో అనేక లోపాలు జరుగుతున్నాయని, పేపరు లీకేజీలు పెరిగిపోయాయని, విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న ప్రధాని మోదీ… ఉద్యోగాలు ఇవ్వకపోగా ఆయన ప్రభుత్వం అనుసరిస్తున్న విధ్వంసకర విధానాల వల్ల ఐదు లక్షల చిన్న, పెద్ద పరిశ్రమలు మూతపడి లక్షలాదిమంది రోడ్డుపాలయ్యారని ఆందోళన వ్యక్తంచేశారు. నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరిగిపోయాయని, గిట్టుబాటు ధరలు లేక రైతులు అల్లాడుతున్నారని విమర్శించారు. ఇక రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కేంద్రానికి భజన చేయడంలో మునిగిపోయిందన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఊసరవెల్లి రాజకీయాలు చేస్తూ ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అంటూ ప్రజలను భ్రమింపజేస్తున్నారని, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోకుండా కార్పొరేట్‌లకు దోచిపెట్టే విధానాలు అమలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అందువల్ల ఈ ప్రభుత్వ విధానాల్లో మార్పు కోరుతూ ప్రజల్లోకి వెళుతున్నామని వివరించారు. ప్రజలు కూడా ఆలోచించి భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టే పాదయాత్రల్లో పెద్దఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. దోనేపూడి శంకర్ మాట్లాడుతూ విజయవాడ నగర్ఙాóవృద్ధిలో కమ్యూనిస్టుల పాత్ర చిరస్మరణీయమన్నారు. కొండ ప్రాంతాల్లో ఇళ్ల పట్టాలు, రహదారులు, మెట్లు, తాగునీరు, డ్రైనేజీ వంటి మౌలిక వసతుల కల్పనలో కమ్యూనిస్టు ప్రజాప్రతినిధులు విశేష కృషి చేశారని గుర్తుచేశారు. విజయవాడ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నగర సహాయ కార్యదర్శులు లంక దుర్గారావు, నక్క వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు.
గుంటూరులో పాదయాత్ర ప్రారంభించిన ముప్పాళ్ళ
గుంటూరు అశోక్నగర్‌లో సీపీఐ నగర కార్యదర్శి అరుణ్ కుమార్ అధ్యక్షతన ‘మార్పు కావాలి-మార్పు సాధ్యం’ ప్రచార పాదయాత్రలను సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు ప్రారంభించారు. అనంతరం ముప్పాళ్ళ మాట్లాడుతూ రైతులు, కార్మికులు, యువత, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో మోదీ ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందిందని విమర్శించారు. ఆగస్టు 17 నుంచి 28 వరకు రాష్ట్రవ్యాప్తంగా జరిగే ప్రజా ఉద్యమాలకు మద్దతివ్వాలని, సెప్టెంబర్ 1న దిల్లీలో జరిగే ‘చలో దిల్లీ’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సీపీఐ జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి, ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి జాతీయ కార్యదర్శి గని, నగర కమిటీ సభ్యులు నూతలపాటి చిన్న, సురేశ్బాబు, ఏఐ‌ఎస్‌ఎఫ్ గుంటూరు జిల్లా కార్యదర్శి యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలం: వనజ
ప్రజా సమస్యలు పరిష్కరించటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ విమర్శించారు. నరసరావుపేట పట్టణంలోని ఏంజెల్ టాకీస్ వద్ద ప్రచార పాదయాత్రను ఆమె ప్రారంభించి, ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు, నల్లధనం వెలికితీత, దేశీయత, మేక్ ఇండియా, జన్ధన్ యోజన, ధరల స్థిరీకరణ నిధి, సమగ్రాభివృద్ధి వంటి అనేక ఎన్నికల వాగ్దానాలు ఇచ్చిన మోదీ సర్కారు… అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కటీ అమలు చేయలేదన్నారు. ప్రజా సమస్యలను పూర్తిగా పక్కకు నెట్టి కుల, మతాలను రెచ్చగొడుతూ దేశభక్తి పేరుతో ప్రజలను రాజకీయ లబ్ధికి బలిచేస్తున్నారని, వీటన్నింటిపై పార్టీ శ్రేణులు ప్రజలను చైతన్యవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి కాసా రాంబాబు, నియోజకవర్గ కార్యదర్శి సత్యనారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలు బలహీనం: జేవీ
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ, ‘బద్లావ్ జరూరీ హై’ (మార్పు కావాలి) నినాదంతో భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర సమితి విస్తృత ప్రచార కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. అందులో భాగంగా గురువారం అనకాపల్లి జిల్లా కేంద్రంలో బైక్ ర్యాలీని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జేవీ సత్యనారాయణమూర్తి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ప్రైవేటీకరణ, ప్రజాస్వామ్య వ్యవస్థల బలహీనతకు బీజేపీ అనుసరిస్తున్న విధానాలే కారణమన్నారు జిల్లా కార్యదర్శి రాజాన దొరబాబు అధ్వర్యంలో జరిగిన నిరసన యాత్రలో బాలేపల్లి వెంకటరమణ, రెడ్డిపల్లి అప్పలరాజు, కేఎస్ సన్యాసిరావు, దేముడు బాబు తదితరులు పాల్గొన్నారు.
కార్పొరేట్‌లకు దోచిపెడుతున్న మోదీ: హరినాథ రెడ్డి
దేశ సమైక్యత, రాజ్యాంగ పరిరక్షణ, లౌకికవాదం, సమాఖ్య స్ఫూర్తి, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ లక్ష్యంగా సీపీఐ ఉద్యమాలు చేస్తోందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ముందుకు రావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పి.హరినాథరెడ్డి పిలుపునిచ్చారు. సీపీఐ ప్రచార పాదయాత్రను కడప నగరంలోని ఎర్రముక్కపల్లెలో హరినాథ రెడ్డి ఎర్రజెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘సబ్ కా సాథ్ – సబ్ కా వికాస్’ పేరుతో అధికారంలోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీలను విస్మరించి, దేశ సంపదను కొద్దిమంది బడాకార్పొరేట్ సంస్థల ప్రయోజనాలకు అనుకూలంగా వినియోగిస్తోందని విమర్శించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర, అజయ్ తదితరులు పాల్గొన్నారు.
కేంద్రం విధానాలను తిప్పికొట్టండి: రామాంజనేయులు
కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.రామాంజనేయులు పిలుపునిచ్చారు. డోన్ మండలం ఇందిరాంపల్లిలో జరిగిన పాదయాత్రను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం సామాన్య ప్రజల నడ్డి విరిచేలా నిత్యావసర సరుకులు, గ్యాస్, ఇంధన ధరలు విపరీతంగా పెంచుతూ తీవ్ర భారాన్ని మోపుతోందని విమర్శించారు. పాదయాత్రలో సీపీఐ డోన్ పట్టణ కార్యదర్శి మోటా రాముడు, ఏఐటీయూసీ డోన్ మండల అధ్యక్షుడు ఎస్.పులి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దొందూ దొందే: జగదీశ్
ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు గుప్పించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారం చేపట్టిన తర్వాత వాటిని పూర్తిగా విస్మరించాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డి.జగదీశ్ మండిపడ్డారు. బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో జీపు జాతను ప్రారంభించి మాట్లాడారు. అటు మోదీ ప్రభుత్వం, ఇటు చంద్రబాబు ప్రభుత్వం దొందూ దొందేనని, అభివృద్ధి విషయంలో వైఫల్యం చెందాయని మండిపడ్డారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సి.జాఫర్, జిల్లా సహాయ కార్యదర్శులు చిరుతల మల్లికార్జున, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యామ్నాయ రాజకీయాలు అవసరం: దుర్గాభవాని
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలకు నిరసనగా ప్రజలను ఐక్యం చేసి… దేశంలో ప్రత్యామ్నాయ ప్రజా రాజకీయాలకు బాటలు వేయాల్సిన అవసరం ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు పెన్మెత్స దుర్గాభవాని పేర్కొన్నారు. భీమవరం ప్రకాశం చౌక్‌లో పశ్చిమ గోదావరి జిల్లా పాదయాత్రను ఆమె జెండా ఊపి ప్రారంభించారు. సీపీఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు, జిల్లా కార్యవర్గ సభ్యులు కలిశెట్టి వెంకట్రావు, చెల్లబోయిన రంగారావు తదితరులు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నలో
నియంతలు మోదీ, అమిత్ షా సారధ్యంలో కొనసాగుతున్న బీజేపీ దుష్ట పాలన నుండి రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి దేశంలో మార్పు కావాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు సీహెచ్ కోటేశ్వరరావు అన్నారు. ఎన్‌టీఆర్ జిల్లా మూలపాడులో ఆయన పాదయాత్ర ప్రారంభించారు. మహిళా సమాఖ్య ఎన్‌టీఆర్ జిల్లా అధ్యక్షురాలు సీహెచ్ దుర్గా కోటేశ్వరరావు, సీపీఐ మైలవరం నియోజకవర్గ కార్యదర్శి బుడ్డి రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు