విశాలాంధ్ర ధర్మవరం ; జాతీయస్థాయి జూడో పోటీలకు ధర్మవరం మండలంలోని చిగిచెర్ల ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపిక కావడం జరిగిందని హెడ్మాస్టర్ తిమ్మారెడ్డి, ఫిజికల్ డైరెక్టర్ ప్రతాప్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నవంబర్ 28 తేదీ నుండి 30 వరకు చిగిచెర్ల ఉన్నత పాఠశాలలో జరిగిన అండర్ 14 రాష్ట్ర స్థాయి పోటీలలో బంగారు పతకం సాధించిన కావ్య, సంజన ,వీక్షిత్ లు ముగ్గురు లూథియానా లో ఈనెల 6 వ తేదీ నుండి జరిగే జాతీయ స్థాయి జూడో పోటీలకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం తరుపున +44 కేజీల విభాగంలో కావ్య శ్రీ, -27 కేజీల విభాగంలో సంజన,-30 కేజీల విభాగంలో వీక్షిత్ పాల్గొననున్నారు అని తెలిపారు. వీరిని పాఠశాల హెడ్ మాస్టర్ తిమ్మారెడ్డి, పిడి ప్రతాపరెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు, పాఠశాల కమిటీ, తల్లిదండ్రులు, పాఠశాల విద్యార్థులు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.
జాతీయ స్థాయి జూడో పోటీలకు చిగిచెర్ల ఉన్నత పాఠశాల విద్యార్థులు
- Advertisement -
RELATED ARTICLES


