Homeఆంధ్రప్రదేశ్అమరావతిలో రతన్‌టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ప్రారంభించిన సీఎం చంద్రబాబు

అమరావతిలో రతన్‌టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ప్రారంభించిన సీఎం చంద్రబాబు

- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లో నూతన ఆవిష్కరణలకు వేదికగా నిలిచే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌కు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మంగళగిరి సమీపంలోని మయూరి టెక్ పార్క్ ప్రాంగణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్‌లు ఈ హబ్‌ను లాంఛనంగా ప్రారంభించారు. దాదాపు 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించబడుతున్న ఈ కేంద్రం, రానున్న రోజుల్లో స్టార్టప్‌లకు, నూతన ఆలోచనలకు మార్గదర్శిగా నిలవనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాంకేతిక అవసరాలను తీర్చగల స్టార్టప్ కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశారు.

అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా తీర్చిదిద్దే దిశగా చర్యలు
అమరావతిని కేంద్రంగా ఏర్పాటు చేస్తున్న ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్, డీప్ టెక్, కృత్రిమ మేధ , సుస్థిరత, సమ్మిళిత ఆవిష్కరణలకు ప్రధాన వేదిక కానుంది. ఈ క్రమంలో అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా తీర్చిదిద్దే దిశగా చర్యలు చేపట్టనున్నారు. అంతేకాకుండా, భవిష్యత్‌లో ఆవిష్కరణ ఆధారిత ఆర్థిక వ్యవస్థలకు ప్రమాణంగా ఇది రూపుదిద్దుకోనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభను ఆకర్షించేందుకు, పెట్టుబడులను పెంపొందించేందుకు, అలాగే ఇన్నోవేషన్ ఆధారిత విధానాలకు ప్రాధాన్యత ఇవ్వడం ఈ హబ్ ముఖ్య లక్ష్యం.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు