Homeజిల్లాలుఅల్లూరి సీతారామ రాజుపన్నులు త్వరగా వసూలు చేయండి

పన్నులు త్వరగా వసూలు చేయండి

- Advertisement -

– ఎంపీడీఓ శంకరరావు

విశాలాంద్ర- వలేటివారిపాలెం;. సచివాలయం సిబ్బంది తమ పరిధిలోని గ్రామాలలో పన్నులు త్వరగా వసూలు చేయాలని ఎంపీడీఓ వై. శంకరరావు అన్నారు. బుధవారం శాఖవరం సచివాలయం ను ఎంపీడీఓ వై. శంకరరావు, చుండి సచివాలయం ను డిప్యూటీ ఎంపీడీఓ నారాయణ రావు, సమీర్ పాలెం సచివాలయం ను డిప్యూటీ ఎంపీడీఓ (జిఎస్ డబ్యూ ఎస్ )బి.రాంబాబు లు తనిఖీ లు చేశారు. ఈ సందర్బంగా సచివాలయం సిబ్బంది కి ఇంటి పన్నుల వసూలు, యుఎస్ఎస్ సర్వే, సిటిజన్ ఈ కె వైసీ తదితర సర్వేల గురించి వివరించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సచివాలయం పరిధిలోని గ్రామాలలో సర్వే లు త్వరగా పూర్తి చేయాలని సిబ్బంది కి తెలియజేశారు. ఇంటి పన్నులు వసూలు లో వెనకబడి ఉన్నందున ప్రజలు ఇల్లు వద్ద ఉన్న సమయంలో వారి ఇంటివద్ద కు వెళ్లి పన్నులు వసూలు చేయాలని సచివాలయం సిబ్బంది ని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వై. శంకరరావు, డిప్యూటీ ఎంపీడీఓ నారాయణ రావు, డిప్యూటీ ఎంపీడీఓ (జిఎస్ డబ్యూ ఎస్ )బి రాంబాబు, పంచాయతీ కార్యదర్శులు రవికుమార్, వేణు,శాఖవరం గ్రామపార్టీ అధ్యక్షులు వడ్లమూడి వెంకటేశ్వర్లు,సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు