విశాలాంద్ర, అనంతపురం కార్పొరేషన్ : విశాలాంధ్ర పత్రిక 75 ఏళ్ల విజయోత్సవాల సందర్భంగా ఆ పత్రిక లోగోను మంగళవారం అనంతపురం జిల్లా కలెక్టరేట్లో కలెక్టరు ఓ.ఆనంద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1952 నుండి ఇప్పటి వరకు విశాలాంధ్ర నడిపించటం ఎంతో గర్వకారణం అన్నారు. సమాజంలో వెనుకబడిన వర్గాలు కార్మికులు కర్షకులు రైతులు అనేక వివిధ కార్మిక సంఘాలకు అండగా ఉంటూ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ నేటితరం వరకు కూడా ముందుకు సాగుతున్న విశాలాంధ్ర పత్రిక అని కొనియాడారు. శ్రమజీవుల కష్టసుఖాలతో పంచుకొని 75 ఏళ్ల విజయోత్సవాలను జరుపుకుంటున్న విశాలాంధ్ర పత్రిక సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాల బ్యూరోచీఫ్ జయనందనరెడ్డి, ఎపియుడబ్ల్యుజె జిల్లా ప్రధాన కార్యదర్శి పయ్యావుల ప్రవీణ్, విశాలాంధ్ర విలేకర్లు షేక్షావలి, రవి, ఎపియుడబ్ల్యుజె జిల్లా నాయకులు చలపతి, చౌడప్ప తదితరులు పాల్గొన్నారు.


