Homeతెలంగాణతెలంగాణ డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్

తెలంగాణ డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్

- Advertisement -

జిల్లాల అధికారులు తనకు శుభాకాంక్షలు చెప్పేందుకు హైదరాబాద్ కు రావొద్దన్న డీజీపీ
తెలంగాణ నూతన డీజీపీగా సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు. డీజీపీ కార్యాలయానికి చేరుకున్న సీవీ ఆనంద్‌కు పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వేదమంత్రోచ్చారణ మధ్య పండితుల ఆశీర్వచనాలతో ఆయన తన స్థానంలో కూర్చున్నారు. బాధ్యతల స్వీకారానికి ముందు గౌరవ వందనం స్వీకరించారు. సీవీ ఆనంద్‌కు పలువురు ఉన్నతాధికారులు శుభాకాంక్షలు తెలియజేశారు.సీవీ ఆనంద్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి ఆయన కుటుంబ సభ్యులు హాజరయ్యారు. బాధ్యతల స్వీకరణ అనంతరం ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు పెద్దపీట వేస్తానని అన్నారు.

బాధ్యతలు చేపట్టడానికి ముందు కీలక ఆదేశాలు

డీజీపీగా బాధ్యతలు స్వీకరించడానికి ముందు సీవీ ఆనంద్ ఆయా జిల్లాలకు చెందిన అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. తాను బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా ఎవరూ హైదరాబాద్‌కు రావొద్దని కోరారు. అన్ని జిల్లాల ఎస్పీలు, సీపీలు ఈరోజు ఉదయం కచ్చితంగా తమ తమ కార్యాలయాల్లో విధుల్లో ఉండాలని ఆదేశించారు. తమకు కేటాయించిన జిల్లాల్లోనే అధికారులు రిపోర్ట్ చేయాలని, అనవసర ప్రయాణాలు వద్దని సూచించారు. సమయం వచ్చినప్పుడు తానే స్వయంగా వచ్చి కలుస్తానని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు