Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఇల్లు, సాగు భూమిని పంపిణీ చేయాలి

ఇల్లు, సాగు భూమిని పంపిణీ చేయాలి

- Advertisement -

ముదిగుబ్బ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు
విశాలాంధ్ర ధర్మవరం/ముదిగుబ్బ:: ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలతోపాటు భూమి లేని పేదలకు కూడా సాగు భూమిని పంపిణీ చేయాలన్న డిమాండ్తో, సిపిఐ పార్టీ రాష్ట్ర సమితి పిలుపు మేరకు మండలములోని రెవెన్యూ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని సిపిఐ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు నిర్వహించారు. అనంతరం డిమాండ్తో కూడిన వినతి పత్రాన్ని తాసిల్దార్ మహేశ్వర్ రెడ్డికి అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మండలంలో వేల మంది నిరుపేదలు సొంత గూడు లేక అద్దె ఇళ్లలో జీవనం సాగిస్తున్నారు అని, ఈ మేరకు ప్రభుత్వం తక్షణమే ఇల్లు లేని పేదలకు ఇంటి స్థలాలు మంజూరు చేయడమే గాక అద్దె ఇళ్లలో ఉన్న వారికి బాడుగ కూడా ప్రభుత్వమే చెల్లించాలని కోరారు. గత వైసిపి ప్రభుత్వం లో మండల వ్యాప్తంగా సుమారు 2000 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయగా వాటిలో 70 శాతం మందికి ఊరికి దూరంగా మూడు కిలోమీటర్ల దూరంలో అనువు గాని చోట ఇళ్ల పట్టాల పంపిణీ చేయడంతో అక్కడ నేటికీ ఒక ఇల్లు కూడా నిర్మాణం జరగకపోవడంతో ఆ స్థలాలు ఎటు పనికిరాకుండా పోయాయి అన్నారు, కనుక ఇప్పటికైనా మండల కేంద్రానికి దగ్గర్లో కబ్జాదారుల చేతుల్లో ఉన్న భూములను తక్షణమే స్వాధీనం చేసుకొని ఆ భూములను పేదలకు పంపిణీ చేయాలని తెలిపారు.ఈ నేపథ్యంలో పట్టణంలో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు స్థలాలను పంపిణీ చేసి తద్వారా ఒక్కోఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు కేటాయించాలని ఆయన పేర్కొన్నారు.అదేవిధంగా గత మూడేళ్ల నుంచి కొన్ని వేలమంది కొత్త పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న కూటమి ప్రభుత్వం నేటికీ ఒక్క పింఛను కూడా మంజూరు చేయకపోవడం దారుణం అన్నారు. అదేవిధంగా మండలంలో గత కొన్నేళ్లుగా సాగుతున్న భూమాఫియాను అరికట్టాలన్నారు. మండల కేంద్రంతోపాటు చాలా గ్రామాల్లో స్మశానవాటికలు ముఖ్యంగా హిందూ స్మశాన వాటిక లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు, కనక మండల వ్యాప్తంగా స్మశాన వాటికలు ఏర్పాటు చేయడానికి కూడా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని వారి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ మండల సహాయ కార్యదర్శులు తిప్పయ్య, ఈశ్వర్ నాయక్, రైతు సంఘం నాయకులు డాబా రామకృష్ణ లతో పాటు సిపిఐ పార్టీ స్థానిక నాయకులు రాధాకృష్ణ, శంకర, తుమ్మల చిన్నప్ప, లింగుట్ల వెంకట రాముడు, ఎల్ రామకృష్ణ, చెన్నప్ప, చాంప్లా నాయక్, ముత్తులూరి మధు, గంగులప్ప, ఏ రామంజి సరస్వతి భాయ్, ముత్యాలు భాయ్ సన్నాభాయ్, వేలూరు వెంకటేశు, టైలర్ వెంకటేష్, ధర్మే నాయక్, వెంకటేశ్వర నాయక్, తదితరులు పాల్గొన్నారు,

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు