Homeఆంధ్రప్రదేశ్వికటించిన ప్రేమ.. గొంతు కోసుకున్న యువకుడు

వికటించిన ప్రేమ.. గొంతు కోసుకున్న యువకుడు

- Advertisement -

విశాలాంధ్ర, గుడిబండ: గుడిబండ మండల కేంద్రంలో ఒక యువకుడు గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన కలకలం రేపింది.మోపురుగుండు గ్రామానికి చెందిన ఈర రామప్ప కుమారుడు రామాంజి మూడు సంవత్సరాలుగా హెరేతూర్పి గ్రామానికి చెందిన యువతితో ప్రేమలో ఉన్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెకు 25 వేల రూపాయల విలువైన సెల్‌ఫోన్, రెండు లక్షల రూపాయల విలువ చేసే బంగారు గొలుసు చేయించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. డిసెంబర్ నెలలో వారి వివాహానికి పెద్దలు కూడా ఒప్పందం కుదుర్చుకున్నారు.అయితే అకస్మాత్తుగా యువతి కర్ణాటకకు చెందిన మరో వ్యక్తితో వెళ్లిపోయిందని తెలిసి రామాంజి షాక్‌కు గురయ్యాడు. తీవ్ర మనస్తాపంతో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసినట్లు సమాచారం.స్థానికులు గమనించి వెంటనే గుడిబండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుండి పరిస్థితి విషమించడంతో స్థానిక నాయకుల సహకారంతో మడకశిర ప్రభుత్వాసుపత్రికి, అనంతరం డాక్టర్ల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు తరలించినట్లు తెలుస్తోంది.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు