Homeఆంధ్రప్రదేశ్సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం : ఎన్డీఏ ప్రభుత్వం ప్రతి పేదవానికి అండగా నిలుస్తోందని, ప్రైవేట్ ఆస్పత్రులలో పలు రకాల జబ్బులకు ఆరోగ్యశ్రీ వర్తించని వారికి సీఎంఆర్ఎఫ్ కొండంత అండగా ఉంటుందని టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ధర్మవరం నియోజకవర్గంలో వివిధ రకాల జబ్బులతో బాధపడి ప్రైవేట్ ఆసుపత్రులలో చికిత్స పొందిన 12 మందికి 10,34,630 రూఁలు చెక్కులను పట్టణ తెలుగుదేశం పార్టీ క్యాంప్ కార్యాలయంలో పరిటాల శ్రీరామ్ చికిత్స పొందిన బాధితులకు అందజేయడం జరిగిందన్నారు. అందులో ముదిగుబ్బ మండలానికి 3,38,810 రూఁలు,ధర్మవరం పట్టణానికి 2,99,728 రూఁలు,ధర్మవరం రూరల్ కు 3,96,092 రూఁలు మంజూరయ్యాయి అని తెలిపారు. ముదిగుబ్బ మండలం సానేవారిపల్లెకి చెందిన కుళ్లాయప్పకు23,400 రూఁలు, కొడవండ్ల పల్లికి చెందిన నారాయణస్వామికి 25,166 రూఁలు, ముదిగుబ్బ టౌన్ కు చెందిన నాగరత్నమ్మకు 50,250 రూఁలు, ఉప్పలపాడు కు చెందిన హర్షితకు 2,04,453 రూఁలు, ముదిగుబ్బ టౌన్ కు చెందిన పవన్ కుమార్ కు20,000 రూఁలు, ముక్తాపురం చెందిన పురుషోత్తం నాయుడుకు15,541 రూఁలు, ధర్మవరం పట్టణానికి చెందిన లక్ష్మయ్యకు 43,914 రూఁలు, రామకృష్ణమ్మకు1,50,240 రూఁలు, చంద్రశేఖర్ కు 30,000 రూఁలు, కళ్యాణి కుమారికి 25,574 రూఁలు, గిరిధర గుప్తకు 50,000 రూఁలు, ధర్మవరం రూరల్ చింతలపల్లికి చెందిన పథకమూరి వెంకటేష్ కు 3,96,092 రూఁలు విలువగల చెక్కులను వారు అందజేశారు. అందజేశారు ఎంతోమంది ఆపన్నులకు అభయహస్తంగా సీఎంఆర్ఎఫ్ నిలుస్తోందని నారా చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి,సంక్షేమంలో ముందుకు దూసుకు వెళ్తోందని అన్నారు. సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందుకున్న బాధితులు నరేంద్ర మోడీ ,నారా చంద్రబాబునాయుడు ,పవన్ కళ్యాణ్ నిధులు మంజూరు చేయించిన పరిటాల శ్రీరామ్ లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్, జూనియర్ నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు