విశాలాంధ్ర పుట్టపర్తి:- శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రం మార్పుపై వస్తున్న బదంతులపైన ఎమ్మెల్యే స్పందించాలని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి డిఎస్ కేశవరెడ్డి పేర్కొన్నారు. బుధవారం వైసీపీ పార్టీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ పుట్టపర్తి కేంద్రంగా కాకుండా హిందూపురానికి మారుస్తున్నారని వదంతులు రావడంతో పుట్టపర్తిలోని వైసీపీ నాయకులు బాలకృష్ణ, సీఎం చంద్రబాబు నాయుడుపై మండిపడుతున్నారు.మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి సాధించిన జిల్లాను హిందూపురానికి తరలిస్తే కార్యాచరణ చేపడతామన్నారు.వైయస్సార్సీపి జిల్లా కేంద్రాన్ని పుట్టపర్తి చేయడం జీర్ణించుకోలేక బాలకృష్ణ కావాలనే హిందూపురానికి తరలించకపోతున్నాడన్నారు. సత్య సాయి బాబా నడయాడిన పుట్టపర్తిని కాకుండా హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా చేస్తామంటే ఊరుకునేది లేదన్నారు. జిల్లా కేంద్రం మార్పుపై వదంతులు వస్తున్న ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడకపోవడం దారుణం అన్నారు. దీనిపై ఎమ్మెల్యే, మాజీ మంత్రి స్పందించాల్సిన బాధ్యత వారిపై ఎంతైనా ఉందన్నారు. సత్యసాయిబాబా భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా వీరి ప్రవర్తన ఉందని మండిపడ్డారు. జిల్లా తరలించకపోయిన తర్వాత మాట్లాడి ప్రయోజనం లేదన్నారు. ప్రజలకు క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లా తరలిపోకుండా పార్టీల కతీతంగా పనిచేయాలని, ర్యాలీలు, రాస్తా రోకలు, ఆమరణ నిరాహార దీక్షలకు తాము కూడా సిద్ధమని తెలిపారు. జిల్లా తరలించాలని చూస్తే ఉద్యమాలు ఉదృతం చేస్తామని వైసిపి నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుంగ ఓబుళపతి, వైస్ చైర్మన్ తిప్పన్న, కన్వీనర్లు రవి నాయక్, ఈశ్వరయ్య, కేశప్ప, రమణ, లక్ష్మిరెడ్డి, ఎంపీపీ శ్రీధర్ రెడ్డి, అగ్రిగోల్డ్ మాజీ చైర్మన్ రమణారెడ్డి, కౌన్సిలర్లు పవన్ కుమార్, చెరువు భాస్కర్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి , నారాయణరెడ్డితదితరులు పాల్గొన్నారు.
జిల్లా మార్పుపై వస్తున్న వదంతులపై ఎమ్మెల్యే స్పందించాలి..
- Advertisement -
RELATED ARTICLES


