Homeజిల్లాలుశ్రీ సత్యసాయిక్షయ వ్యాధిగ్రస్తులకు పౌష్టిక ఆహారం పంపిణీ..

క్షయ వ్యాధిగ్రస్తులకు పౌష్టిక ఆహారం పంపిణీ..

- Advertisement -

ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ తిపేంద్ర నాయక్
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో క్షయ వ్యాధిగ్రస్తులకు పౌష్టిక ఆహారమును ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ తిపేంద్ర నాయక్ చేతులు మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ తిపేంద్ర నాయక్, డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ చెన్నారెడ్డి మాట్లాడుతూ క్షయ వ్యాధి తో బాధపడుతున్న వారికి ప్రస్తుతం మందులు మింగుతున్న వారికి సంగో కంపెనీ, ఏపీ అండ్ పి ప్రాంతం గ్యాస్ ఏజెన్సీ వారి తరఫున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. కోడిగుడ్లు వంటనూనె చిక్కిళ్ళు, పౌష్టికి ఆహారంగా అందజేయడం జరిగిందని తెలిపారు. తదుపరి వ్యాధిగ్రస్తులు అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిబి యూనిట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రియాంక, జిల్లా పిపిఎం కోఆర్డినేటర్ నాగేంద్ర, టిబి సూపర్వైజర్ క్రిష్టప్ప, చంద్రకళ, సావిత్రి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు