Tuesday, November 18, 2025
Homeఆంధ్రప్రదేశ్అన్న క్యాంటీన్ ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

అన్న క్యాంటీన్ ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

- Advertisement -

*క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి మీ అభిప్రాయం తెలియ చెయండి*

– కలెక్టర్ పి ప్రశాంతి 

విశాలాంధ్ర – తూర్పుగోదావరి : అన్న క్యాంటీన్ లో పేదల కోసం అందించే ఆహారం నాణ్యతలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా, రుచిగా మరియు శుచిగా ఉండాలని జిల్లా కలెక్టర్, కమిషనర్ (F.A.C) పి. ప్రశాంతి సూచించారు. గురువారం సుబ్రహ్మణ్య మైదానం సమీపంలో ఉన్న అన్న క్యాంటీన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసి ప్రజల అభిప్రాయాలు తెలుసుకుని, నిర్వాహకు లకు సూచనలు చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ,  మెనూ ప్రకారం భోజన పదార్థాలు ఉండేలా చూడాలన్నారు.  సమయ పాలన తప్పనిసరిగా పాటించాలని నిర్వాహకులను,  సిబ్బందిని ఆదేశించారు. క్యాంటీన్ పరిసరాలలో స్వచ్ఛత, టోకెన్ కౌంటర్, డైనింగ్ ఏరియా, చేతులు శుభ్రం చేసుకునే ప్రదేశం, టాయిలెట్లు తదితర సౌకర్యాలను ఆమె పరిశీలించారు. ఆర్వో వాటర్ ఫిల్టర్ ను క్రమం తప్పకుండా శుభ్రపరచాలని, పాత్రలు, ప్లేట్లను తప్పని సరిగా వేడి నీటిలోనే శుభ్రం చేయాలని సూచించారు.భోజనం నాణ్యతపై లబ్ధిదారుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్న కలెక్టర్, ప్రజలు తమ సూచనలు క్యాంటీన్ లో ఏర్పాటు చేసిన QR కోడ్ ద్వారా నేరుగా తెలియ జేయవచ్చని తెలిపారు. పేదల కోసం ప్రభుత్వం కేవలం 5 రూపాయలకే అల్పాహారం, భోజన సదుపాయం కల్పిస్తోందన్నారు. అన్నా క్యాంటీన్ లలో ఆహ్లాదకరమైన, పరిశుభ్రమైన వాతావరణంలో భోజనం చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.అలాగే ప్రతిరోజూ అన్న క్యాంటీన్లను పరిశీలించి, ఏ మరమ్మతులు ఉన్నా వెంటనే చేయించి ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. భోజన అనంతరం వ్యర్థాలను  ఇక్కడ ఏర్పాటు చేసిన చెత్తబుట్ట లోనే వేయాలని ప్రజలకు సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు