Wednesday, February 18, 2026
Homeఆంధ్రప్రదేశ్నిరాశ్రయులకు మానవ హక్కులు కల్పించడమే లక్ష్యం

నిరాశ్రయులకు మానవ హక్కులు కల్పించడమే లక్ష్యం

- Advertisement -


విశాలాంధ్ర – రాజ‌మండ్రి సిటీ ;  మానవ హక్కులు కోల్పోయి, అణచివేతకు గురుగుతున్న నిరాశ్రయులకు హక్కుల కల్పించడమే లక్ష్యంగా హ్యూమన్ రైట్స్ ప్రొటక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పనిచేస్తుందని హ్యూమన్ రైట్స్  ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నేషనల్ చైర్మన్ తాళ్లూరి ప్రసన్నకుమార్  పేర్కొన్నారు. గురువారం రాజమహేంద్రవరం వై జంక్షన్ లోని ఆనం రోటరీ హాల్లో హ్యూమన్ రైట్స్ ప్రొటక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్ర, తెలంగాణ చైర్ పర్సన్ డాక్టర్ ఖాండవల్లి లక్ష్మి  ఆధ్వర్యంలో మానవ హక్కుల పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయ‌న ముఖ్య అతిథిగా పాల్గొని  మాట్లాడుతూ  తమ సంస్థ ద్వారా ప్రతినెల జిల్లాలలో మానవ హక్కుల పై అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు. భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తికి హక్కులు ఉంటాయని, ఆ హక్కులు పొందే విధంగా తమ సంస్థ ఉచితంగా న్యాయ సలహాలు అందిస్తుందన్నారు. వీటితోపాటు మానవ హక్కుల కోల్పోయిన నిరాశ్రయులకు అండగా ఉండి వారి హక్కులను పరిరక్షిస్తుందన్నారు.  రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో తమ సంస్థ నుంచి విడిపోయిన కొందరు వ్యక్తులు ప్రభుత్వ అధికారుల వద్దకు వెళ్లి బ్లాక్ మెయిలింగ్, ఇతర అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలిసిందని, వారితో తమ సంస్థకు ఏ విధమైన సంబంధం లేదన్నారు. హూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా రాజమండ్రి, రాజమండ్రి రూరల్, రాజానగరం తదితర ప్రాంతాలలో మహిళ హక్కుల రక్షణకు, వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న డాక్టర్ ఖండవల్లి లక్ష్మి సేవలు గుర్తించి నేషనల్ అవార్డును బహుకరించారు.  హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్ర, తెలంగాణ మహిళా చైర్మన్,  నేషనల్ అవార్డు గ్రహీత డాక్టర్ ఖాండవల్లి లక్ష్మీ మాట్లాడుతూ రాజకీయంగా ఉన్నత పదవిలో  ఉన్నప్పటికీ ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల చైర్ పర్సన్ గా పదోన్నతి కల్పించడమే కాకుండా, నేషనల్ అవార్డు బహుకరించి ప్రోత్సహించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో  డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ నాగిడి శ్రీ లక్ష్మీ , జిల్లా వినియోగదారుల కమిషన్ ప్రెసిడెంట్ జె. ప్రసాద్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్  పేరిచర్ల సూర్య ప్రభావతి, డిస్టిక్ ఇమ్యూనిజేషన్ ఆఫీసర్  డాక్టర్ కోమలి,  సివిల్ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ మేరీ వసంతి , రాజనగరం తాసిల్దార్  జి అనంతలక్ష్మి దేవి,  టి. కనకవల్లి ,అడ్వకేట్ మరియు విజిలెన్స్ కమిటీ సభ్యులు ధర్నాలకోట వెంకటేశ్వరరావు , ప్రముఖ న్యాయవాది తోర్లపాటి సీతల్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు