Homeఆంధ్రప్రదేశ్డిఎన్ఆర్ మృతి దుళ్ళ గ్రామానికి తీరని లోటు

డిఎన్ఆర్ మృతి దుళ్ళ గ్రామానికి తీరని లోటు

- Advertisement -

విశాలాంధ్ర – కడియం : తూర్పుగోదావరి జిల్లా, కడియం మండలం, దుళ్ళ మాజీ సర్పంచ్ దూడల నాగేశ్వరరావు (డీఎన్ఆర్)మృతి ఆ గ్రామానికి తీరని లోటని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. డిఎన్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఇండియన్ నర్సరీమేన్ మాజీ అధ్యక్షులు పల్ల సుబ్రమణ్యం, పల్ల వెంకన్న చారిటబుల్ ట్రస్ట్ చైర్మెన్ పల్ల సత్యనారాయణ మూర్తి, ప్రముఖ నర్సరీ రైతు, టీడీపీ నాయకులు గంగుమళ్ళ సత్యనారాయణ, కడియపులంక ఉపసర్పంచ్ పాఠంశెట్టి రాంజీ, మండల పరిషత్ ఉపాధ్యక్షులు పంతం గణపతి, నర్సరీ రైతులు కర్రి ఎస్ఐ, పుల్లా శ్రీను, తాడాల రఘు, నందపునీడి గంగారావు, మురమండ సొసైటీ మాజీ అధ్యక్షులు ఈదర దీనదయాళ్, ప్రముఖ వస్త్ర వ్యాపారి కొండపల్లి ప్రసాద్, ఆలమూరు మండల టీడీపీ నాయకులు మెర్ల గోపాలం తదితరులు శనివారం డిఎన్ఆర్ భార్య మాజీ సర్పంచ్ దూడల రత్నం మరియు కుటుంబ సభ్యులను పరామర్శించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు