Homeఅంతర్జాతీయంసంప్రదాయ పద్ధతితో ఆకట్టుకున్న వినాయకుడు

సంప్రదాయ పద్ధతితో ఆకట్టుకున్న వినాయకుడు

- Advertisement -

– వినాయకుడికి ఘనంగా వీడ్కోలు పలికారు 

విశాలాంధ్ర – సీతానగరం: సంప్రదాయ పద్ధతితో ఆకట్టుకున్న వినాయకుడు ఊరేగింపు. మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలలో శనివారం ధూమ్ ధామ్ గా వినాయక స్వామి విగ్రహాలు ఊరేగింపులు చేసి నిమర్జనాలు చేశారు. మునికూడలి గ్రామ పంచాయతీ పరిధిలో దేవన్ష్ ఘాట్ వద్ద తహసిల్దార్ శ్రీనివాస్, ఎస్ఐ రామ్ కుమార్ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాట్ల మధ్య వినాయక విగ్రహాలు నిమర్జనాలు చేశారు. ఈ సందర్భంగా రామ్ కుమార్ మాట్లాడుతూ అన్ని గ్రామాల నుంచి శనివారం 52 విగ్రహాలు నిమర్జనాలు జరిగాయని అన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవడం జరిగింది అని అన్నారు. వీటిలో కాటవరం గ్రామంలో సాంప్రదాయ పద్ధతిలో జరిగిన ఊరేగింపు ఆకట్టుకొంది. అలాగే రఘుదేవపురం చెరువు గట్టు వద్ద గల వర సిద్ధివినాయాక స్వామి గుడిలో లడ్డు 27వేల రూపాయలకు యాలమాటి శివ దుర్గా గణేష్ ధక్కించుకున్నారు. 

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు