విశాలాంధ్ర – అనంతపురం టౌన్ : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి చిన్నపిల్లల విభాగం వైద్యులు, స్టాఫ్ నర్సులు మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. గురువారం స్థానిక ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఆస్పత్రి సూపర్డెంట్ డాక్టర్ మల్లీశ్వరి విలేకరులతో మాట్లాడుతూ… ప్రాణ అపాయ స్థితిలో ఆసుపత్రికి చేరుకున్న తొమ్మిది సంవత్సరాల వైష్ణవికి పునర్జన్మను ప్రసాదించారు అని పేర్కొన్నారు కనగానపల్లి మండలం మద్దెలచెరువు గ్రామానికి చెందిన 9 సంవత్సరాల వయసు గల వైష్ణవి ను డిసెంబర్ 20వ తేదీన జ్వరము, ఒంటిమీద దద్దుర్లు, మూర్చ మరియు అపస్మారక స్థితిలో అనంతపురంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తీసుకొని రావడం జరిగిందన్నారు . వైద్యులు వెంటనే చిన్న పిల్లల వార్డులో అడ్మిట్ చేసుకొని రక్త పరీక్షలు, స్కానింగ్ పరీక్ష చేసి చిన్నారి స్క్రబ్ టైఫాస్, మెదడువాపు మరియు సివియర్ నిమోనియా తో బాధపడుతున్నట్లు గుర్తించి పి ఐ సి యు లో వెంటిలేటర్ పై ఉంచి నాలుగు రోజులపాటు నిరంతర వైద్య సేవలు అందించారన్నారు. కాస్త కోలుకున్న తర్వాత పి ఐ సి యు స్టెప్ డౌన్ లో అనంతరం సాధారణ వార్డులో ఉంచి 34 రోజులపాటు నిరంతరంగా అందించిన చికిత్సతో చిన్నారి కోలుకుందన్నారు.
వైష్ణవి తల్లి మాట్లాడుతూ… పెద్దాసుపత్రిలోనే చిన్న పిల్లల విభాగం వైద్యులు, స్టాఫ్ నర్సులు మా బిడ్డను బతికించారు వాళ్ళు దేవుళ్ళతో సమానం అని భావోద్వేగం తో తెలియజేశారు.ఈ సమావేశంలో ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ డా డి. మల్లీశ్వరి, ఆర్ ఎం ఓ డా.జి. హేమలత, చిన్నపిల్లల విభాగం హెచ్ ఓ డి డా. ఎం.రవి కుమార్ లతో కలిసి చిన్నపిల్లల వార్డు వైద్య బృందం డా. సంజీవప్ప డా. ప్రవీణ్ దేన్ కుమార్ డా. భాస్కర్ నాయక్ డా. శ్రీనివాస్ డా.మమత డా.రాధిక, పీజీ స్టూడెంట్స్, స్టాఫ్ నర్స్ లను అభినందించారు.
చిన్నారి వైష్ణవికు పునర్జన్మను ప్రసాదించిన వైద్యులు
- Advertisement -


