సిపిఐ పార్టీ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు
విశాలాంధ్ర ధర్మవరం/ముదిగుబ్బ : నియోజకవర్గ పరిధిలోని ముదిగుబ్బ మండలంలో రైతుల అవసరాల దృష్ట్యా మరో రెండు కందుల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ముదిగుబ్బ మండల సిపిఐ పార్టీ కార్యదర్శి చల్లా శ్రీనివాసులు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.
ఈ మేరకు మండల కేంద్రమైన ముదిగుబ్బతో పాటు మల్లేపల్లి గ్రామ పరిధిలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని శ్రీనివాసులు కోరారు.జిల్లాలోనే పెద్ద మండలంగా పేరు గాంచి 25 పంచాయతీలు 86 గ్రామాలు కలిగిన ఈ ప్రాంతంలో ఈసారి 7,561 ఎకరాలలో రైతులు కంది పంటను సాగు చేయడం జరిగిందన్నారు, కాగా గత కొన్నేళ్లుగా మండల పరిధిలోని బత్తలపల్లి మండల సరిహద్దులో ఉన్న రాళ్ల అనంతపురం గ్రామంలో మాత్రమే కందుల కొనుగోలు కేంద్రాన్ని నిర్వహిస్తుండడంతో మండలంలోని చాలా గ్రామాలకు ఈ కొనుగోలు కేంద్రం సుమారు 25 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో ఆయా గ్రామాలకు చెందిన రైతన్నలు తమ కంది పంటను ఈ కేంద్రానికి తరలించడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన చేశారు. అతివృష్టి, అనావృష్టి కారణాలతో ఓవైపు గిట్టుబాటు ధరలు లేక మరోవైపు కంది పంట నష్టాల బాటలో పయనిస్తున్న తరుణంలో సుదూరంలో ఉన్న ఈ కొనుగోలు కేంద్రానికి కందుల బస్తాలను తరలించడానికి రవాణా ఖర్చులు కూడా అధికమవుతుండడంతో ఆర్థికంగా రైతన్నల మరింత ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఈ పరిస్థితుల్లో అదనపు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే విషయమై మండల తాసిల్దార్ నారాయణస్వామిని సంప్రదించగా ఆయన తనకేమీ తెలియదని సమాధానమివ్వడం విడ్డూరంగా ఉందని విచారణ వ్యక్తం చేశారు, కనుక ఇప్పటికైనా కంది పంట సాగుచేసిన రైతుల సంక్షేమం కోసం తక్షణమే మండలంలో మరో రెండు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు, లేనిపక్షంలో రైతన్నలతో కలిసి త్వరలోనే ధర్నా కార్యక్రమం చేపడతామని తెలిపారు
ముదిగుబ్బ మండలంలో మరో రెండు కందుల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి..
- Advertisement -
RELATED ARTICLES


