Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఏఐవైఎఫ్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే గరికిపాటికి దమ్ముందా..?

ఏఐవైఎఫ్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే గరికిపాటికి దమ్ముందా..?

- Advertisement -

ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి శాఖల రాజా
విశాలాంధ్ర ధర్మవరం;; గరికిపాటి నరసింహారావు విద్యార్థుల చదువు, వారి హక్కులపై మాట్లాడటం బాగానే ఉంది కానీ ఏఐవైఎఫ్ అడిగే ప్రశ్నలకు గరికిపాటికి సమాధానం చెప్పే దమ్ముందా..? అని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి శాఖల రాజా పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు సిపిఐ కాలనీలో పట్టణ అధ్యక్షులు గోవర్ధన్ ఏర్పాటుచేసిన విలేకరులతో మాట్లాడుతూ పేద విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వద్దు అనడంలో గరికపాటి ఆంతర్యం ఏమిటి అని?, పేదల పిల్లలకు చదువుకోవడం ఇష్టం లేదా?, ప్రభుత్వాలు వారికి పౌష్టిక ఆహారం అందిస్తుంటే మీకు వచ్చే ఇబ్బంది ఏంటి అని? వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పౌష్టిక ఆహార లోపం ఉన్నవారు ప్రతిరోజు గుడ్డు తీసుకోవాలని ఆరోగ్యశాఖ సూచించే సూచనలు గరికిపాటికి కనపడలేదా అని వారు సూటిగాప్రశ్నించారు.రాయలసీమ, ఉత్తరాంధ్ర లాంటి ప్రాంతాల్లో తల్లిదండ్రులుతో పాటు వలసలు వెళ్లిన పేద పిల్లలు బాలకార్మికల అవుతున్నారని చెప్పే ప్రభుత్వ లెక్కలు చూడలేదా..? అని ప్రశ్నించారు.
పేదలకు పౌష్టికాహారం అందించాలని చెప్పే ఆహార భద్రతా చట్టం చదవలేదా…? అని ప్రశ్నించారు.
మదమెక్కిన మనువాద సిద్ధాంతం.. మీ బుర్రను ఏమైనా కలుషితం చేసిందా..?! అని తెలిపారు.విద్యార్థులకు నైతిక విలువలు చెప్పే మీరు.. పిల్లలకు మధ్యాహ్నం భోజన పథకం అవసరమా అని ప్రశ్నించడం చాలా దారుణం అని మండిపడ్డారు. ఇప్పటికైనా ఇటువంటి మాటలు మాట్లాడకూడదని వారు హితవు పలికారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు