Homeజిల్లాలుతూర్పు గోదావరిశాంతి రథం బహుకరించిన దాత కరుటూరి

శాంతి రథం బహుకరించిన దాత కరుటూరి

- Advertisement -

విశాలాంధ్ర-దేవరపల్లి-:దేవరపల్లి మండల మానవతా సంస్థకు శాంతి రథం బహుకరించిన దాత కరుటూరి ధనుంజయుడు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా శుక్రవారం సాయంత్రం దుద్దుకూరుసొసైటీ వద్ద జరిగిన కార్యక్రమంలో దాత ధనంజయుడు దేవరపల్లి మండల మానవతా సంస్థ సభ్యులకు అందజేశారు ఈ సందర్భంగా గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు మాట్లాడుతూ మానవతా సంస్థ సేవలు మరువలేమని సమస్త ఏర్పడినప్పటి నుండి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టింది అన్నారు ముఖ్యంగా శాంతి రథం ఏర్పాటు చేయుట అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులోకి ఉంటుందని అన్నారు శాంతిరథం బహుకరించిన దాత కరుటూరి ధనుంజయుడును ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అభినందించారు అనంతరం దాత కరుటూరి ధనుంజయుడు మాట్లాడుతూ తన తండ్రి స్వర్గీయ కరుతూరి సూర్యారావు పేరున 7 లక్షల రూపాయల వ్యయంతో శాంతి రథం కొనుగోలు చేసి మానతా సంస్థకు బహుకరించినట్లు తెలిపారు దేవరపల్లి మండలం మానతా సమస్త సభ్యులు బల్ల సూర్యచక్రం బండి సూర్యప్రకాశరావు కేసు రాజు రాజకుమార్ శాంతి రథం బహుకరించిన దాత కరటూరి ధనింజయుడు అభినందించారు ఈ కార్యక్రమంలో మానవతా స్వచ్ఛంద సంస్థ జిల్లా అధ్యక్షుడు కండెపు సూర్యనారాయణ జొన్నలగట్ల రాంబాబు స్థానిక నేతలు ముళ్ళపూడి దొరాజి చౌదరి కరుటూరి శ్రీరామమూర్తి ఆచంట చిన్న శేషారావు ముళ్ళపూడి సత్యనారాయణ ముళ్ళపూడి గంగాధరరావు కొయ్యలమూడి తాతారావు డి సువర్ణ రాజు సంభ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు