Wednesday, February 18, 2026
Homeఆంధ్రప్రదేశ్తిరుమల పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది : సీఎం చంద్రబాబు

తిరుమల పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది : సీఎం చంద్రబాబు

- Advertisement -

దేవుడితో పెట్టుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) హెచ్చరించారు. తిరుమల పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో వైసీపీ నేతలు బుకాయిస్తే వాస్తవాలు మారతాయా అని ప్రశ్నించారు. దౌర్జన్యం, రౌడీయిజం చేస్తే సహించబోనని చెప్పారు. లడ్డూ కల్తీ వ్యవహారం నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌, పలువురు మంత్రులతో కలిసి సీఎం కీలక భేటీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు.

‘‘తప్పుచేసి దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు మాపై వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు. బూతులు తిట్టినా మేం భరించాలా? దోషులను అన్ని విధాలుగా శిక్షిస్తాం. ఈ వ్యవహారంలో చర్యలు తీసుకోవాలని సీబీఐ మాకు ఓ నివేదిక పంపింది. ఏక సభ్య కమిషన్‌ వేసి అన్నీ పరిశీలిస్తాం. అవసరమైతే కోర్టులో కూడా అదనపు సమాచారం చేరుస్తాం. ఇది ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశం. వారి మనోభావాలతో ఆడుకోవద్దని ఆనాడే చాలా స్పష్టంగా చెప్పాం. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ పిచ్చి పరాకాష్ఠకు చేరింది. విగ్రహాల ధ్వంసాన్ని ప్రశ్నిస్తే హేళనగా మాట్లాడారు. తప్పు చేసిన వాళ్లపై చర్యలు తీసుకోవాల్సింది పోయి మాపైనే ఎదురుదాడికి దిగారు. నెయ్యి కల్తీపై 2022లో నివేదిక వస్తే అప్పటి పాలకులు ఎందుకు తొక్కిపెట్టారు? తప్పు జరుగుతోందని తెలిసి కూడా దాన్ని కొనసాగించారు. కల్తీ జరుగుతోందని నివేదికలో చాలా స్పష్టంగా చెబితే దాన్ని తొక్కిపెట్టి యథేచ్ఛగా కొనసాగించారు. నేను సీఎం కాగానే ప్రక్షాళన మొదలుపెట్టా. పొరపాటు జరుగుతోందని న‌మూనాల‌ను పరీక్షలకు పంపాం. ఎన్‌డీడీబీ నివేదికలోని అంశాన్నే నేను ప్రస్తావించా. వైసీపీ నేతలకు దేవుడంటే లెక్కలేనితనమనుకోవాలా? విశ్వాసం ఉండే భక్తుల మనోభావాలను దెబ్బతీయాలనేది మీ లక్ష్యమా? దేవుడి పవిత్రతను దెబ్బతీయడం మహాపాపం. ఇంతవరకు చరిత్రలో వెంకన్నస్వామి జోలికి ఎవరూ రాలేదు. దేవుడికి అపచారం జరిగినప్పుడు ముక్తకంఠంతో ఖండించాల్సిన బాధ్యత మనపై ఉంది. అపవిత్రం జరిగినప్పుడు భగవంతుడే ప్రజలను సమాయత్తం చేస్తారు. మీరు చేసిన పని దుర్మార్గమైన అపచారం’’ అని చంద్రబాబు అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు