డిజిటల్ మహిళా సంఘం ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్
విశాలాంధ్ర – రాజమండ్రి సిటి ; గృహిణులు సొంతంగా వ్యాపార వేత్తలుగా అభివృద్ధి చెందడానికి అనువుగా డిజిటల్ మహిళా సంఘాన్ని ఏర్పాటు చేసినట్లు నేషనల్ డైరెక్టర్ అశ్విని చెప్పారు. శుక్రవారం మధ్యాహ్నం స్థానిక జాంపేటలోని పోలీస్ కన్వెన్షన్ సెంటర్ లో డిజిటల్ మహిళా సంఘం బజార్ ను ఏర్పాటు చేసిన సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. ఈ ఎగ్జిబిషన్ లో అనేక ప్రాంతాలకు చెందిన వందలాది మంది మహిళలు వారు స్వంతంగా తయారు చేసిన వస్తువుల స్టాల్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తమ సంఘంలో అందరూ గృహిణులే సభ్యులుగా ఉంటారని, వారందరూ వారికి అభిరుచి ఉన్న రంగాలలో వ్యాపార వేత్తలుగా రాణించడానికి తమ వంతు కృషి చేస్తున్నామన్నారు. దీనికి గాను ఫేస్ బుక్ వేదికగా ఉన్న 14000 గృహిణులకు తాము వారికి అభిరుచి ఉన్న రంగాలలో శిక్షణ నిచ్చి వారి ద్వారా చిన్న మొత్తాలతో వ్యాపారాలు ప్రారంభింప చేసి, డిజిటల్ మాద్యమాల ద్వారా వారి వ్యాపార అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. రాజమండ్రికి చుట్టు పక్కల ప్రాంతాలలో ఉన్న మహిళలంతా ఈ ఎక్స్ పోలో పాలు పంచుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షురాలు ఆర్. సింధూష, కార్యదర్శి జి. జాగృతి భాను, ట్రెజరర్ సూర్య కవిత, గ్రోత్ ఆఫీసర్స్ కె. గీతారాణి, నిర్మల పాల్గొన్నారు.
ఎగ్జిబిషన్
- Advertisement -
RELATED ARTICLES


