- Advertisement -
మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కమిటీ
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలో ఎక్కడైనా సరే, ఎవరైనా సరే మృతి చెందితే, ఉచితంగా ఫ్రీజర్ను పంపిణీ చేస్తామని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు జగ్గా వేణుగోపాల్, కార్యదర్శి సాయి ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఇటువంటి సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఇప్పటికే వందకు పైగా ఈ సేవా కార్యక్రమాన్ని బాధితులు ఉపయోగించుకున్నారని తెలిపారు. ఏ సమయంలోనైనా ఫ్రీజర్ కావాల్సిన వారు సెల్ నెంబర్ 9440 606510 కు గాని 94911 20502 గాని సంప్రదించాలని తెలిపారు.


