తెలుగుదేశం నాయకులు
విశాలాంధ్ర -వలేటివారిపాలెం : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ట్తాత్మకంగా చేయట్టిన గోకులం షెడ్డు పథకం పాడి రైతులకు ఒక వరం అని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి గొట్టిపాటి హరికృష్ణ,తెలుగుదేశం నాయకులు నలమోతు రవీంద్ర,నవులూరి సుబ్బానాయుడు,టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు ముళ్ల మూడి మాల్యాద్రి, గట్టమనేని లక్ష్మీ నరసింహం, సోమినేని తిరుమల, అత్తోట వెంకటేశ్వర్లు, బొల్లినేని నరసింహం, నవులూరి రమణయ్య, నవులూరి రాంగోపాల్ అన్నారు.శనివారం మండలంలోని పోకూరు గ్రామంలో గట్టమనేని రమాదేవి కుటుంబానికి ప్రభుత్వం కేటాహించిన గోకులం షెడ్డు ను ఏపీడీ బాబూరావు, ఏపీఓ ఉమా మహేష్,టెక్నీకల్ అసిస్టెంట్ మెట్టల అశోక్ తో కలిసి ప్రారంభించారు.ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ గత ఇదేళ్లలో వైసీపీప్రభుత్వం రైతులకు, పాడి రైతులకు ఉపయోగకరమైన ఒక్క మంచి పనికూడా చేయలేదని, నాడు తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన పథకాలు పక్కన పెట్టారని అన్నారు. గోకులం షెడ్డు నిర్మాణాల వలన శుభ్రత పెరిగి, పశువుల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు పాల దిగుబడి పెరుగుతుందని అన్నారు.ఇలాంటి మంచి కార్యక్రమాన్ని అమలు చేయడం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే సాధ్యమవుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.