– వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించేందుకు దోహదం
– కలవచర్ల కెవికెలో ప్రధాని ప్రత్యేక ప్రసారం వీక్షించే విధంగా ఏర్పాట్లు
-తూర్పు గోదావరి జిల్లా వ్యవసాయ శాఖాధికారి ఎస్.మాధవరావు
విశాలాంధ్ర – రాజానగరం : ప్రకృతి వ్యవసాయ రైతుల కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తోడ్పాటు అందించేందుకు సన్నద్ధంగా ఉన్నాయని తూర్పు గోదావరి జిల్లా వ్యవ సాయ శాఖాధికారి ఎస్.మాధవరావు అన్నారు. భారత వ్యవసాయ పరిశోధన మండలి(ఐసిఏఆర్) నందు భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ 42 వేల కోట్ల వ్యయం తో సుమారు 1100 ప్రాజెక్టులను ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పిఎం ధన ధాన్య కృషి యోజన మరియు పప్పు ధాన్య ఆత్మనిర్భరత మిషన్ వేడుకలను రైతులు తిలకించేందుకు మండలంలోని కలవచర్ల గ్రామంలోనీ కృషి విజ్ఞాన కేంద్రం (కెవికె) నందు శనివారం ఏర్పాటు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యక్ష ప్రసారాన్నిసుమారు మూడు వందల మంది రైతులు వీక్షించారు. కార్యక్రమా నికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా వ్యవసాయ శాఖాధికారి ఎస్.మాధవరావు మాట్లాడుతూ పప్పు ధాన్యాల ఉత్పత్తిలో దేశీయ స్వావలంబనను పెంచే లక్ష్యంతో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వా లు కృషి చేస్తున్నాయ న్నారు. పప్పు ధాన్యాల సాగు, ఉత్పత్తి మరియు వినియోగం ద్వారా రైతుల మరియు వినియోగదారుల సాధికారత కల్పించడమే ముఖ్య ఉద్దేశ్యమన్నారు. పంటల్లో రైతులు తీసుకోవాల్సిన ప్రకృతి వ్యవసాయ పద్ధతులను, ఉపయోగాలను, భూమికి జరిగే మేలును రైతులకు వివరించారు.రసాయన అవశేషాలు ఉన్నటు వంటి ఆహార పదార్థాలను తినడం వల్ల ఆరోగ్యంపై కలిగే చెడు ప్రభావాలను వివరించారు.ప్రకృతి వ్యవసాయ రైతులకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వా లు అందజేస్తున్న ప్రోత్సాహకాల గురించి చెప్పారు. విశిష్ట అతిథిగా విచ్చేసిన కలవచర్ల కె వి కె హెడ్,ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వి.ఎస్.జి.ఆర్ నాయుడ మాట్లాడుతూ భారతదేశంలో వ్యవసాయ రంగాన్ని వ్యాపార సరలి లోకి రూపాంతరం చెందించటానికి మరియు యంత్రీకరణను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలలో ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజన ముఖ్యమైనదన్నారు. దేశ ప్రజల ఆహార మరియు పోషకాల భద్రత కొరకు అవసరమైన కందులు మరియు మినుములు వంటి పప్పు ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించడానికి పప్పు ధాన్య ఆత్మనిర్బరత మిషన్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.తొలుత రైతులతో పాటు అధికారులు వెబ్ క్యాస్ట్ ద్వారా పిఎం ప్రసంగాన్ని వీక్షించారు. ఈ కార్యక్రమంలో కె.వి.కె హెడ్ డాక్టర్ వి ఎస్ జి ఆర్ నాయుడు, ఏ పీ సి ఎన్ ఎఫ్ డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ బి తాతారావు, కె.వి.కె అధికారులు డాక్టర్ బి. నాగేశ్వర రెడ్డి, సంజయ్ వినాయక్ హెగ్డే, రఘునందన్, అజ్మల్ లు పాల్గొన్నారు.


