గ్రామీణ ఉపాధి హామీ పనుల పై గ్రామ సభ
విశాలాంధ్ర – సీతానగరం: మండలంలో రఘుదేవపురం గ్రామ పంచాయితీ పరిధిలో శుక్రవారం మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం 2025- 26 పనుల గుర్తింపు గ్రామ సభ నిర్వహించారు. ఈ గ్రామ సభను ఎంపిడిఓ ఎమ్ భారతి ఆధ్వర్యంలో ఏ పి ఓ సత్యవతి గ్రామ ప్రజలతో జరిగింది. ఈ గ్రామ సభ ద్వారా 25 పంట కాలవలు, 2 చెరువులు ,2 ఫారం పాండ్లు, 20 కంపోస్ట్ పిట్లు, 5 గోకులాలు గుర్తించడం జరిగింది అని అన్నారు. అలాగే జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ కేవైసీ వెరిఫికేషన్ కచ్చితంగా చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఇందుగుమిల్లి చంద్రలీల, కార్యదర్శి బరుకుల రత్నం, టెక్నికల్ అసిస్టెంట్ సింహాద్రి, ఫీల్డ్ అసిస్టెంట్ సుబ్బారావు, నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


