Homeఆంధ్రప్రదేశ్ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం

ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం

- Advertisement -

విశాలాంధ్ర – కడియం : ప్రపంచంలోని అత్యంత సుదీర్ఘమైన మరియు వివరణాత్మక లిఖిత రాజ్యాంగాలలో భారత రాజ్యాంగం ఒకటని కడియం ఉప సర్పంచ్ వెలుగుబంటి నాని పేర్కొన్నారు. కడియం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, ప్రధానోపాధ్యాయులు టి సత్యనారాయణ ఆధ్వర్యంలో, రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వెలుగుబంటి నాని మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రపంచ రాజ్యాంగాల లోనే అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుందన్నారు. ప్రతి ఒక్కరు రాజ్యాంగంపై అవగాహన కలిగి ఉండాలని, రాజ్యాంగానికి అనుగుణంగా నడుచుకోవాలని అన్నారు. విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు, వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో రమేష్ బాబు, కృష్ణంరాజు, సువర్ణ వేణి, లక్ష్మి, శ్రీనివాస్, వంగా ప్రసాద్, ఫ్లోరెన్స్, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. 

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు