Homeఆంధ్రప్రదేశ్కలలకు ఆటంకం- గౌరమ్మ

కలలకు ఆటంకం- గౌరమ్మ

- Advertisement -

బాల్య వివాహాలతో బాలికల బంగారు కలలకు ఆటంకం

– బాల్య వివాహ ముక్త భారత్ కొవ్వొత్తుల ర్యాలీ 

– సిడిపివో జి.గౌరమ్మ

విశాలాంధ్ర – రాజానగరం : బాల్య వివాహాలతో బాలికల బంగారు కలలకు ఆటంకపరచడంతో పాటుగా విద్య, రక్షణ, ఆరోగ్యం, అభివృద్ధి వంటి అవకాశాలను దూరం చేస్తుందనీ రాజానగరం చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (సిడిపివో) జి.గౌరమ్మ అన్నారు. మండల కేంద్రమైన రాజానగరంలోని ఎంపీడీవో కార్యాలయం ప్రాంగణంలో ఐసిడిఎస్ సిడిపివో అధ్యక్షతన  ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మరియు చైల్డ్ రైట్స్ అడ్వకసి ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బాల్య వివాహ ముక్త భారత్ కొవ్వుతుల ర్యాలీను గురువారం నిర్వహిం చారు. దీనిలో భాగంగా కొవ్వుతులతో ఐసిడిఎస్ కార్యాలయ అధికారులు, సిబ్బంది, అంగన్వాడిలు ర్యాలీ చేపట్టారు. అలాగే బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. బాల్య వివాహాలు నిర్మూలనపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సిడిపివో జి.గౌరమ్మ మాట్లాడుతూ దేశంలో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు.బాల్య వివాహ నిరోధ చట్టం 2006 ప్రకారం బాల్య వివాహాలు ఒక సాంఘిక దురాచారం మరియు నేరమన్నారు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిఒక్కరు పోరాటం చెయ్యాలని పిలుపునిచ్చారు.నేటి నుండి మార్చి 8వ తేదీ వరకు వంద రోజులు పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారన్నరు.బాలల విద్య మరియు భద్రత కోసం తమ గళాన్ని వినిపిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో డిపివో, చైల్డ్ రైట్స్ అడ్వకసి ఫౌండేషన్ డిస్ట్రిక్ట్ కో ఆర్డినేటర్ బి.రాజ్ కుమార్, మరియు సూపర్వైజర్లు, ఐసిడిఎస్ స్టాఫ్,జిల్లా బాలల పరిరక్షణ విభాగం సిబ్బంది, ఏఎన్ఎంలు,అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు