విశాలాంధ్ర ధర్మవరం:: చిత్తూరు జిల్లాలోని కానిపాక శ్రీ స్వయంభు విగ్నేశ్వర ఆలయంలో శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన మానస నృత్య కళా కేంద్రం గురువు మానస ఆధ్వర్యంలో నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఇందులో గురువు మానస కూడా ప్రత్యేక ప్రదర్శన చేయడం అందరిని అబ్బురపరిచింది. మొత్తం పదిమంది చిన్నారులచే ఈ నృత్య ప్రదర్శన చేయడం వీక్షకులను ఆనందింపజేసింది. కార్యక్రమం అనంతరం దేవస్థానం సూపర్డెంట్ శ్రీధర్ బాబు, కోదండపాణి దేవస్థానం ఇన్స్పెక్టర్ బాలాజీ, పెద్ది పోగు ఆనంద్ చేతులమీదుగా గురువు మానసను ఘనంగా సత్కరించారు. తదుపరి ఇందులో ప్రదర్శించిన పదిమందికి కూడా మెమొంటోలను అందజేశారు. ఈ సందర్భంగా గురువు మానస మాట్లాడుతూ మాకు ఈ నృత్య ప్రదర్శనకు అవకాశం ఇవ్వడం పట్ల ఆలయం వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఆకట్టుకున్న మానస నృత్య ప్రదర్శన
- Advertisement -
RELATED ARTICLES


