విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని విశ్రాంత ఉద్యోగస్తుల భవనంలో వృత్తుల సమావేశమును ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి తూర్పుగోదావరి జిల్లా మహాత్మా గాంధీ సీనియర్ సిటిజెన్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మదన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. వీరు అనేక అంశాల పైన వృద్ధుల సామాజిక బాధ్యతలు అనే అంశంపై వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వృద్ధుల వైద్య నిపుణులు డాక్టర్ నరసింహులు పాల్గొని చేపట్టాల్సిన కార్యక్రమాలు గూర్చి వివరించారు. రోటరీ క్లబ్ మెహర్ బాబా వైదిక శిబిరం సంస్థ, మానవతా సంస్థ చేస్తున్న చర్చా కార్యక్రమాలను తెలిపారు. అనంతరం రిటైర్డ్ ఎస్బిఐ బ్రాంచ్ మేనేజర్ నారాయణమూర్తి ఏటీఎం కార్డులో తీసుకోవలసిన జాగ్రత్తలు గూర్చి వివరించారు. అనంతరం శ్రీ సత్యసాయి జిల్లా శాఖ మహాత్మా గాంధీ సీనియర్ సిటిజెన్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గమును ఎన్నుకున్నారు. ఇందులో అధ్యక్షులుగా డాక్టర్ నరసింహులు, ఉపాధ్యక్షులుగా కొండయ్య, కార్యదర్శిగా సత్య నిర్ధారణ, అదనపు కార్యదర్శిగా పెనుజురి సుజాతమ్మ , సలహాదారులుగా సివిల్ ఇంజనీర్ శ్రీనివాసులు, కార్యవర్గ సభ్యులుగా నారాయణమ్మ ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో నరేందర్ రెడ్డి, డాక్టర్ రామసుబ్బయ్య, రిటైర్డ్ ఉపాధ్యాయుల అధ్యక్షులు చలపతి తదితరులు పాల్గొన్నారు.
జిల్లా సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ ఎంపిక
- Advertisement -
RELATED ARTICLES


