Sunday, November 16, 2025
Homeజిల్లాలుఅనకాపల్లిసాయి శక్తి స్కూల్లో అమానుషం

సాయి శక్తి స్కూల్లో అమానుషం

- Advertisement -

ఇద్దరు విద్యార్థులను చావచితకబాదిన నిర్వాహకడు విద్యార్థుల వీపు, చేతులపై తీవ్రంగా స్టీలు స్కేల్ గుర్తులు, గాయాలు
విచారించిన డీఈవో, పోలీసులు విద్యార్థులకు మద్దతుగా సిపిఐ, ప్రజా సంఘాలు

విశాలాంధ్ర బ్యూరో_ అనకాపల్లి: మిడిమిడి అక్షర జ్ఞానంతో విద్యను వ్యాపార వస్తువుగా మార్చేసిన కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు అంతే మిడిమిడి జ్ఞానం ఉన్న టీచింగ్ స్టాఫ్ తో విద్యా వ్వస్థను భ్రష్టు పట్టిస్తూ అధిక ఫీజులు వసూలే లక్ష్యంగా సాగుతున్న ప్రైవేట్ పాఠశాలల ఆగడాలు రోజురోజుకు పెచ్చుమీరుపోతున్నాయి. విద్యాశాఖ అధికారులు ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు ఇచ్చే కాసులకు కక్కుర్తి పడి పర్యవేక్షణకు పాతరేశారు. నిర్బంధ విద్య, చదువు పేరుతో విద్యార్థులను కొట్టడము వంటి చర్యలకు పాల్పడితే చట్ట ప్రకారము కఠిన చర్యలకు శిక్షార్హులని ఒకపక్క చట్టం చెపుతుంటే అవేవీ పట్టించుకోకుండా లేత మెదడులను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తూ గందరగోళంలోకి నెట్టేస్తూ ర్యాంకుల మోజులో విద్యార్థుల విద్యార్థుల జీవితాలను అంధకారం చేస్తున్న కార్పోరేట్, ప్రైవేట్ విద్యా సంస్థల నిర్వాకాన్ని నిత్యము వార్తలలో చూస్తూనే ఉన్నాం.. కొన్ని విద్యాసంస్థలలో కొంతమంది విద్యార్థులే టార్గెట్ ఆయా విద్యా సంస్థలు వ్యవహరిస్తున్న తీరు అనేక మాధ్యమాలలో చూస్తూనే ఉన్నాం.. అలాంటి సంఘటనే అనకాపల్లి జిల్లా కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించి విద్యార్థుల తల్లిదండ్రులు, బాలల సంరక్షణ వేదిక కార్యకర్త గాడి బాలు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి.
జిల్లా కేంద్రంలో గల గాంధీ నగర్ లో ఉన్న సాయి శక్తి స్కూల్లో శుక్రవారం అమానుష సంఘటన చోటు చేసుకుంది. 9వ తరగతి చదువుతున్న ఏ . సాయిరాజ్, బొబ్బిలి పవన్ కృష్ణ చైతన్య కు బాత్రూం విషయమై చిన్న గొడవ జరిగింది. గమనించిన మరొక విద్యార్థి ఆ విషయాన్ని ప్రిన్సిపల్, స్కూల్ నిర్వాహకులు అన్నం రాజశేఖర్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో విచక్షణ కోల్పోయిన రాజశేఖర్ ఉదయం 11 గంటలకు తరగతిగదిలో చదువుకుంటున్న ఇద్దరు విద్యార్థులపై అమానుషంగా స్టీలు స్కేల్ తో దాడి చేసి చావచితకబాదాడు. దాంతో ఇద్దరు విద్యార్థులు వీపులపై, చేతులపై స్టీల్ స్కేలు గుర్తులు, ఎర్రగా కందిపోయిన గుర్తులు ఏర్పడ్డాయి. అయినప్పటికీ ఇద్దరు విద్యార్థులు ఆ నొప్పిని భరించి పాఠశాలలోనే ఉన్నారు. సాయంత్రం 6 గంటలకు పాఠశాల నుంచి ఒక టీచర్ విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ పిల్లలు అల్లరి ఎక్కువగా చేస్తున్నారు. సారు కొట్టారు అని చెప్పగా తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి జరిగిన సంఘటనపై ఆరా తీయగా అప్పటికే తీవ్ర గాయాలతో విద్యార్థులు పడుతున్న బాధను చూసి పాఠశాల యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారు. గాయాలతో ఉన్న విద్యార్థులను ఆస్పత్రికి తీసుకువెళ్లి పట్టణ పలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న డీఈవో శనివారం పాఠశాలకు వచ్చి అక్కడ సిబ్బందిని, బాధిత విద్యార్థులను, వారి తల్లిదండ్రులను విచారించారు. ప్రిన్సిపల్ రాజశేఖర్ అందుబాటులో లేకపోవడంతో స్కూల్ సిబ్బందికి షోకాజ్ నోటీస్ అందజేశారు. 24 గంటల్లోగా జరిగిన సంఘటనపై వివరణ ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. ఇది ఇలా ఉండగా తక్షణమే ప్రిన్సిపల్ ఇక్కడికి రావాలని డిమాండ్ చేస్తూ ప్రైవేట్ పాఠశాలల అనుసరిస్తున్న విధానాలపై సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి రాజాన దొరబాబు ఆధ్వర్యంలో స్కూలు ముందుబైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులకు వచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ సీఐ విజయ్ కుమార్ స్కూలుకు వెళ్లి విచారణ జరిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు