- Advertisement -
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను ఆకస్మికంగా డిఐఇఓ చెన్నకేశవులు, ఆర్జెడి సురేష్ బాబు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కళాశాలలోని పలు రికార్డులను వారు పరిశీలించారు. అనంతరం విద్యార్థుల ప్రగతి గూర్చి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇరువురు మాట్లాడుతూ ఆధునిక విద్యా విలువలను పెంపొందిస్తూ విద్యార్థినీలకు అవగాహన కలిగించేలా బోధన విలువలు పాటించాలని తెలిపారు. గతంలో కన్నా ఈ సంవత్సరం మరింత మెరుగైన ఫలితాలను సాధించేలా అధ్యాపకులు కృషి చేయాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ వనిత వాణి, అధ్యాపకులు పాల్గొన్నారు.


