- Advertisement -
విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు);మండల పరిధిలోని ముచ్చిగిరి గ్రామానికి చెందిన ఉపాధి కూలీ నరసప్ప (32)గుండెపోటుతో బుధవారం మృతి చెందారు. గ్రామ శివారులో జరుగుతున్న ఉపాధి పనికి వెళ్లి ఇంటికి వచ్చిన తర్వాత ఛాతీ దగ్గర నొప్పిగా ఉందని చెప్పి కుప్పకూలినట్లు బంధువులు తెలిపారు. చికిత్స నిమిత్తం ఎమ్మిగనూరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడన్నారు. దీంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు.


