విశాలాంధ్ర – సీతానగరం: భూ సేకరణతో చేసి రైతులకు పుంత రోడ్డు ఏర్పాటు చేయాలని రెండు వేల ఎకరాలకు చెందిన రైతులు కోరుతున్నారు. మండలంలో చీపురుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో చీపురుపల్లి, చినకొండేపూడి ప్రధాన రహదారి నుంచి 0.42 కిమి దాటిన తరువాత పుంత రోడ్డు ఉందని ఈ పుంత రోడ్డు రాపాక కోటికేశవరం రోడ్డుకు కలుస్తుంది అన్నారు. ఈ పుంత రోడ్డు రెండు వేల ఎకరాలకు చెందిన 800 మంది రైతులు లబ్ది పొందుతారు అని కోనే ప్రభాకర్, బల్లాని శ్రీను, నాగారపు సత్యనారాయణ, ముదునూరి సూర్పరాజు, దోనే రాంబాబు నల్లమోలు వీరబాబు తదితర రైతులు విజ్ఞప్తి చేసారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఖరీష్, దాళ్వా సీజన్ లలో ఎరువులు తీసుకొని వెళ్ళాలన్నా, చేతికి ఉచ్చిన పంట తెచ్చుకోవలి అన్నా రైతులు తీవ్ర ఇబ్బందులకు పడుతున్నారు అని అన్నారు ఈ పుంత రోడ్డుకు చీపురుపల్లి రోడ్డు నుంచి ఈ పుంత రోడ్డుకు లింకు లేదని ఇది రోడ్డు నుంచి 0.42 కి.మీ అనగా పది ఎకరాల పొడవు ఉంటుందని ఆ రైతులు నష్టపరిహారం ఇస్తే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని అని అన్నారు. దీనికి గాను య.0.75 సెoట్లు భూసేకరణ ఆవశరం అవుతుందన్నారు. ఈ భూసేకరణకు 30 నుంచి 40 లక్షల రూపాయలు అవసరం అవుతుందని అని అన్నారు. ఈ పుంత రోడ్డు ఏర్పాటుకు అధికారులు, నాయకులు ఒక సారి క్షుణ్ణంగా పరిశీలించి రైతులకు పుంతరోడ్డు మంజూరు చేసి రైతుల ఇబ్బందులు తొలగించాలని కోరుతున్నారు ఇదే సమస్య పై జిల్లా కలెక్టర్ కు సైతంవినతి పత్రం సమర్పించడం జరిగింది అని అన్నారు.
భూ సేకరణతో చేసి రైతులకు పుంత రోడ్డు నిర్మించాలి
- Advertisement -
RELATED ARTICLES


