Tuesday, November 18, 2025
Homeజిల్లాలుఅనంతపురంగొర్రెల మందపై చిరుత నక్క దాడి

గొర్రెల మందపై చిరుత నక్క దాడి

- Advertisement -

30 గొర్రెపిల్లల మెడలు కొరికి చంపిన చిరుత

విశాలాంధ్ర , కళ్యాణదుర్గం.. కంబదూరు మండలం కర్తనపర్తి గ్రామ నివాసి చెన్నక్క కుమారుడు బి.మహేంద్ర కి చెందిన గొర్రెల మందపై శుక్రవారం చిరుత నక్క దాడి చేసింది. నాలుగు నెలల వయసున్న గొర్రె పిల్లల మెడలను కొరికి తిన్న చిరుతనక్క అక్కడి నుండి పరారైంది. గొర్రెల యజమాని గొర్రెలమంద దగ్గరికి వచ్చి చూడగా 30 గొర్రె పిల్లలు మృతి చెందిన దృశ్యాన్ని చూసి బోరున విలపించారు. దసరా పండుగ కి గొర్రెపిల్లలు (బొడుగలు ) అమ్మకాలు జరిపి ఉంటే రూ.2 లక్షలు వచ్చేవని గొర్రెల యజమాని మహేంద్ర వాపోయాడు. శనివారం అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి వెళ్లి జరిగిన నష్టాన్ని అంచనా వేశారు. ప్రభుత్వానికి నివేదిక పంపుతామని ఫారెస్ట్ అధికారులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు