విశాలాంధ్ర , కళ్యాణదుర్గం… కంబదూరు మండలం డి చెన్నేపల్లి గ్రామానికి చెందిన టిడిపి సీనియర్ నాయకులు చిన్న ముత్యాలప్ప (85) మృతి చెందారు. కర్తనపర్తి గ్రామపంచాయతీ సర్పంచ్ గా చిన్న ముత్యాలప్ప భార్య రామలక్ష్మి పని చేశారు. టిడిపిలో శీన నాయకుడిగా గుర్తింపు ఉన్న ముత్యాలప్ప మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే సురేంద్రబాబు మేనల్లుడు ధర్మతేజ గ్రామానికి వెళ్లి భౌతిక కాయానికి నివాలి అర్పించారు. చిన్న ముత్యాలప్ప కుటుంబానికి టిడిపి అండగా ఉంటుందని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కర్ణం కిష్టప్ప, నాగరాజు, నాగేంద్ర , సుధాకర్ ,విశశాంక్ తదితరులు పాల్గొన్నారు


